క్రీడాభూమి

స్టార్ రాకెట్లు రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 1: లండన్ వేదికగా జూలై 2 నుంచి 16వరకు నిర్వహించే ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నమెంట్‌కు ప్రపంచవ్యాప్తంగా టాప్ స్టార్లు రెడీ అవుతున్నారు. మహిళల సింగిల్స్‌లో ఇప్పటికే ఏడుసార్లు వింబుల్డన్ చాంపియన్‌గా అవతరించిన 36 ఏళ్ల అగ్రశ్రేణి క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ మరోసారి చాంపియన్‌షిప్‌ను కైవశం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.
కుమార్తెకు జన్మనిచ్చిన తర్వాత గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడిన సెరెనా భుజం గాయం కారణంగా నాలుగో రౌండ్‌తోనే నిష్క్రమించింది. రొమేనియా స్టార్ క్రీడాకారిణి, ఇటీవల జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ సిమోనా హలెప్ మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగనుంది. మూడేళ్ల తర్వాత ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ టైటిల్ అందుకున్న రష్యా స్టార్ క్రీడాకారిణి మరియా షరపోవా కూడా ఇపుడు వింబుల్డన్‌పై కనే్నసింది. 2016లో జరిగిన వింబుల్డన్ సందర్భంగా గాయపడడంతో ఆమె ఆడే అవకాశం లేకపోయింది. గత నాలుగేళ్ల నుంచి ఎలాంటి గ్రాండ్ శ్లామ్‌లను అందుకోలేకపోయింది. 2014లో ఫ్రెంచి ఓపెన్‌లో ట్రోఫీని అందుకుంది.
స్విస్ దిగ్గజం, ఇప్పటికే ఎనిమిదిసార్లు వింబుల్డన్ చాంపియన్‌గా అవతరించిన రోజర్ ఫెదరర్ పురుషుల విభాగంలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగనున్నాడు. రెండుసార్లు వింబుల్డన్ చాంపియన్‌గా ఘనత సాధించిన 31 ఏళ్ల ఆండ్రీ ముర్రే సైతం పురుషుల సింగిల్స్‌లో గాయం కారణంగా 11 నెలలపాటు విశ్రాంతి తీసుకుంటున్న ముర్రే ఇపుడు ఆడే అవకాశం లేకపోయినట్టే. ఇక క్లే కోర్టుల్లో రారాజుగా వెలుగొందుతూ, వరల్డ్ నెంబర్ వన్‌గా రాణిస్తున్న రాఫెల్ నాదల్ సైతం ఇపుడు వింబుల్డన్ ట్రోఫీపై కనే్నశాడు.
ఇటీవల జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను 11వసారి గెల్చుకున్న ఘనతను సాధించిన నాదల్ గత ఏడాది మూడు గ్రాండ్ శ్లామ్‌లు గెల్చుకున్నాడు. తన ఖాతాలో ఇప్పటికే 17 సార్లు గ్రాండ్‌శ్లామ్ చాంపియన్‌గా అతవరించిన నాదల్ 2011కి ముందు రెండుసార్లు వింబుల్డన్ ట్రోఫీని అందుకున్నా, ఆ తర్వాత మళ్లీ ఎనిమిదేళ్లకు తర్వాత మళ్లీ ఇపుడు వింబుల్డన్ ట్రోఫీ అందుకోవాలని కలలుగంటున్నాడు.