క్రీడాభూమి

హీరోకి.. సలాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైరో, జూలై 1: మహమ్మద్ సలా..ఆఫ్రికా జట్లలో ఫేవరిట్‌గా దిగిన బరిలోకి దిగిన ఈజిప్టు స్టార్ స్ట్రయికర్. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితేనేం..1990 తర్వాత వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన ఈజిప్టు ఇపుడు మళ్లీ ఇనే్నళ్ల తర్వాత తొలిసారిగా రష్యాలో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్ పాల్గొంది. ఈ టోర్నీలో భాగంగా ఉరుగ్వే, రష్యా, సౌదీ అరేబియాతో జరిగిన మూడు మ్యాచ్‌లలోనూ ఈజిప్టు ఖాతా తెరవకుండా నిరాశపరిచింది. భుజం గాయం కారణంగా సలా ఉరుగ్వేతో జరిగిన తన తొలి మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఆడిన సలా తమ దేశంతోపాటు వేలాది అభిమానులు, మద్దతుదారులు తనపై పెట్టుకున్న అంచనాలను తల్లకిందులు చేసి నిరాశపరిచాడు. ఆడిన రెండు మ్యాచ్‌లలో కేవలం రెండు గోల్స్ (రష్యాపై ఒకటి, సౌదీ అరేబియాపై ఒకటి) చేసినా జట్టును లీగ్ దశ నుంచి నాకౌట్‌కు చేర్చడంలో విఫలమయ్యాడు. గ్రూప్ దశనుంచి ఈజిప్టు నిష్క్రమించిన తర్వాత మహమ్మద్ సలా రష్యా నుంచి నేరుగా తమ స్వదేశం కైరోలోని ఇంటికి చేరుకున్న తర్వాత వేలాది అభిమానులు, మద్దతుదారులు అతని ఇంటిముందు గుమికూడారు. వాస్తవానికి ఒక స్టార్ ఆటగాడు పోటీలో తమ జట్టును గెలిపించకుంటే అభిమానులు, మద్దతుదారులు దాడులు, విమర్శలు, ఎత్తిపొడుపులు చేయడం పరిపాటి. కానీ అందుకు భిన్నంగా సలా విషయంలో ఎదురైంది. తమ అభిమాన ఆటగాడు జట్టును లీగ్ దశనుంచి నాకౌట్‌కు తీసుకెళ్లలేకపోయినా వారంతా ఏమాత్రం నిరాశ, నిస్పృహ వ్యక్తం చేయలేదు సరికదా ఫొటోలు, ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. దీంతో చిరునవ్వు చిందిస్తూనే సలా వారితో ఫొటోలు దిగుతూ వారి కోరికలను మన్నించి మరింత మెప్పు పొందాడు.