క్రీడాభూమి

పోర్చుగల్‌ను గట్టెక్కించని రొనాల్డో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోచి (రష్యా): రష్యా ఫిఫా వరల్డ్ కప్ చాంపియన్‌గా అవతరించాలని కలలుగన్న పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఆశలపై ఉరుగ్వే సంచలనం, పారిస్ సెయింట్-జర్మన్ స్ట్రయికర్ ఎడిన్‌సన్ కవానీ నీళ్లు జల్లాడు. తన అద్భుత ఆటతీరుతో ప్రేక్షకులను మైమరపింపజేసి ప్రత్యర్థిపై 2-1 తేడాతో గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. శనివారం అర్ధరాత్రి పోర్చుగల్-ఉరుగ్వే మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. ఆట ప్రథమార్ధం నుండే ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే, ఆ ప్రారంభమైన ఏడు నిమిషాలకే ఉరుగ్వే యువ సంచలన ఆటగాడు మెరుపు వేగంతో తొలి గోల్ చేసి జట్టుకు శుభారంభం అందించాడు. ప్రథమార్థంలోనే ఉరుగ్వేకు తొలి గోల్ లభించడంతో పోర్చుగల్ టీమ్ తొలుత కాస్త ధీమాతో ఉన్నా దాదాపు 50 నిమిషాల వరకు ఇరు జట్లు ఎలాంటి గోల్ చేయలేకపోయాయి. పోర్చుగల్ ఆట మొత్తంలో 68 శాతం బంతిని తమ ఆధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేసింది. ప్రత్యర్థి జట్టు కూడా 32 శాతం బంతిని తమ కస్టడీలో ఉంచుకోడానికే పోరాడింది. ఆట రెండో అర్ధ్భాగం ప్రారంభమైన 10 నిమిషాల్లో అంటే 55వ నిమిషంలో పోర్చుగల్ స్టయికర్ పపె తొలి గోల్ చేయడంతో ఆ జట్టులో ఆనందం వెల్లివిరిసింది. అప్పటికి ఇరు జట్ల స్కోరు సమం కావడంతో రెండో గోల్ కోసం పోర్చుగల్, ఉరుగ్వే పరస్పర దాడులకు సైతం దిగాయి. పోర్చుగల్ ప్రత్యర్థిపై 20 సార్లు దాడులకు ప్రయత్నించగా, ఉరుగ్వే కేవలం ఐదుసార్లు మాత్రమే దాడులకు తెగబడింది. ఈ తరుణంలో ఆట 62వ నిమిషంలో ఉరుగ్వే జట్టుకు తొలి గోల్‌ను అందించిన ఎడిన్‌సన్ కవానీ సహచరుడి నుంచి అందిన పాస్‌తో బంతిని గోల్‌గా మలచి జట్టుకు ఆధిక్యాన్ని పెంచాడు. దీంతో పోర్చుగల్‌పై తీవ్ర ఒత్తిడి పడింది. రెండో గోల్ కోసం ఆ జట్టు సభ్యులంతా శతధా ప్రయత్నించినప్పటికీ ఆట ముగిసేసరికి మరో గోల్ నమోదు కాకపోవడం, అప్పటికే ఉరుగ్వే 2-1తో పోర్చుగల్‌పై ఆధిక్యంతో ఉండడంతో ఘనవిజయం సాధించింది. ఇదిలావుండగా, ఉరుగ్వే 1930 తర్వాత ఆడిన నాలుగు ప్రపంచ కప్ టోర్నమెంట్‌లలోని ఓపెనింగ్ గేమ్స్‌లో గెలిచిన తర్వాత క్వార్టర్ ఫైనల్స్‌కు చేరడం ఇదే తొలిసారి. ఇపుడు పోర్చుగల్‌పై ఘన విజయాన్ని నమోదు చేసుకున్న ఉరుగ్వే క్వార్టర్ ఫైనల్స్‌లో తొలి నాకౌట్‌లో అర్జెంటీనాపై గెలిచిన ఫ్రాన్స్‌తో వచ్చే శుక్రవారం తలపడుతుంది. ఇదిలావుండగా, పోర్చుగల్ నాలుగు వరల్డ్ కప్ మ్యాచ్‌లలో నాకౌట్‌లోనే నిష్క్రమించింది. అయితే, 2006లో ఇంగ్లాండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో గోల్ చేయకుండానే మ్యాచ్ డ్రా అయింది. 1972లో రియోడిజెనరియోలో ఉరుగ్వే-పోర్చుగల్ జట్లు తలపడిన తర్వాత మళ్లీ ఈ రెండు జట్లు తలపడడం ఇదే తొలిసారి. ప్రపంచ ఫుట్‌బాల్ జట్లలో పేరెన్నికగన్నవాటిల్లో అర్జెంటీనా, పోర్చుగల్ ఒకేరోజు రష్యా ఫిఫా వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ నుంచి నిష్క్రమించడంతో అభిమానులను విషాదంలో ముంచెత్తింది. అర్జెంటీనా ప్రీ క్వార్టర్స్‌లోని తొలి మ్యాచ్‌లో 4-3తో ఫ్రాన్స్‌పై పరాజయం, అదేరోజు జరిగిన రెండో మ్యాచ్‌లో పోర్చుగల్ 2-1 తేడాతో ఉరుగ్వేతో ఓడిపోయాయి. అర్జెంటీనాతో జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో ఫ్రాన్స్ స్ట్రయికర్ ఎంబప్పె రెండు గోల్స్ చేయడం ద్వారా స్టార్ ఆటగాడిగా నిలవగా, పోర్చుగల్‌తో జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో ఉరుగ్వే స్ట్రయికర్ రెండు గోల్స్ చేసి మరో స్టార్ ఆటగాడిగా ఘనత వహించాడు.