క్రీడాభూమి

ఆసియా గేమ్స్‌కు ఫుట్‌బాల్ జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 2: ఈ ఏడాది ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2వరకు ఇండోనేషియాలోని జకార్తాలో జరిగే ఆసియా క్రీడలకు భారత్ తరఫున ఫుట్‌బాల్ జట్టును పంపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. వాస్తవానికి ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం ఖండాంతర స్థాయిలో 1-8 మధ్య ర్యాంకింగ్స్‌లలో నిలిచిన జట్లు మాత్రమే పాల్గొనేందుకు అర్హత సాధిస్తాయి. ఈ మేరకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కు సుదీర్ఘ లేఖ రాయగా వారినుంచి వచ్చిన స్పందన తమను నిరాశకు గురిచేసిందని ఏఐఎఫ్‌ఫ్ జనరల్ సెక్రెటరీ కుశాల్ దాస్ తెలిపాడు. ఆసియా గేమ్స్‌కు భారత్ తరఫున ఫుట్‌బాల్ జట్టును పంపేందుకు ఐఓఏ అంగీకారం తెలపకున్నా తామే ఖర్చులు భరించి పంపడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నాడు. అయితే, ఈ విషయమై ఐఓఏ నుంచి ఇంకా సరైన స్పందన రాలేదని తెలిపాడు.