క్రీడాభూమి

ఫెదరర్‌దే పైచేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 2: లండన్‌లో సోమవారం ప్రారంభమైన వరల్డ్ కప్ టెన్నిస్ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెదరర్ విజయం సాధించాడు. సెర్బియా క్రీడాకారుడు, మాజీ వరల్డ్ నెంబర్ 57 డసన్ లజోవిక్‌ను 61, 6-3, 6-4 తేడాతో 79 నిమిషాల్లో ఓడించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. ఫెదరర్ వింబుల్డన్ టోర్నీ మొదటి రౌండ్‌లో గెలుపొందడం ఇది 20వ సారి. ఒక సెర్బియా క్రీడాకారుడిని వింబుల్డన్‌లో ఫెదరర్ రెండోసారి ఓడించాడు. ఈ సందర్భంగా ఫెదరర్ మీడియాతో మాట్లాడుతూ ఈ మ్యాచ్ ప్రారంభంలో తాను కొంత ఇబ్బంది పడ్డానని, తర్వాత పుంజుకుని విజయం సాధించానని అన్నాడు. ఫెదరర్ రెండోరౌండ్‌లో స్లవాకియాకు చెందిన లుకాస్ లకావో లేదా ఫ్రెంచ్ బెంజమిన్ బోంజీతో తలపడతాడు. మరోవైపు మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో స్లొయేన్ స్టీఫెన్స్ క్రొయేషియా క్రీడాకారిణి డొన్నా వేకిక్‌ను 6-1, 6-3 తేడాతో ఓడించింది.