క్రీడాభూమి

సమఉజ్జీల పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్, జూలై 2: పొట్టి ఫార్మాట్లలో ఇద్దరు సమఉజ్జీల మధ్య పోరు మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న టీమిండియా ఆతిధ్య జట్టుతో నేటి నుంచి వచ్చే నెల 11వరకు మూడు టీ-20లు, మూడు వనే్డలు, ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. నిజానికి అన్ని విభాగాల్లో రెండు జట్లు సమానంగా ఆడగల సత్తా ఉన్నవే. గత దశాబ్దకాలంగా టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో స్థిరంగా ఆడుతోంది. కొద్దిరోజుల కిందట ఐర్లాండ్‌తో జరిగిన టీ-20 సిరీస్‌ను కోహ్లీ సేన తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇంగ్లాండ్‌తో ఆట అంత సులువు కాదని కోహ్లీకి తెలియంది కాదు. భారత్ గత మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌తోపాటు శ్రీలంకతో జరిగిన నిదహాస్ ట్రోఫీ టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు సహా 20 మ్యాచ్‌లు ఆడితే వాటిలో 15 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. టీమిండియా జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, సురేష్ రైనా, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు పరుగులు జోడించగల సత్తా ఉన్నవారు. వీరితోపాటు బౌలర్లు కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, దినేష్ కార్తీక్‌లు జట్టుకు ఆయువుపట్టు. ఇక ఇంగ్లాండ్ విషయానికొస్తే ఆల్‌రౌండర్లు, స్పిన్నర్లు, పేసర్లకు కొదవలేదు. కొద్దిరోజుల కిందట ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను 6-0తో గెల్చుకోవడంలో జోస్ బట్లర్, జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టోవ్ వంటివారు కీలక పాత్ర పోషించారు. గత ఏడాదికాలంలో ఇంగ్లాండ్ తొమ్మిది టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి జట్లతో తలపడి ఐదు మ్యాచ్‌లలో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది.
చాహల్ మైండ్ గేమ్: కోహ్లీ
తమ జట్టులో మణికట్టు మాంత్రికుడు యుజువేంద్ర చాహల్ కీలకం కానున్నాడని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఆయా మ్యాచ్‌లలో చాహల్ తన సమర్థవంతమైన పాత్రను పోషిస్తాడనే నమ్ముతానని అన్నాడు. ఇంగ్లాండ్ టూర్ వెళ్లే ముందు ఈమేరకు టీ-20లో ఎలా వ్యవహరించాలన్న అంశంపై కోహ్లీతో చాహల్ సుదీర్ఘంగా చర్చించాడు. చాహల్ ఇప్పటికే ఆడిన పలు టీ-20 మ్యాచ్‌లలో అందరి అంచనాలకు భిన్నంగా వ్యవహరిస్తూ జట్టును విజయతీరాలకు చేర్చడంలో కృతకృత్యుడయ్యాడని కోహ్లీ పేర్కొన్నాడు.