క్రీడాభూమి

హాల్ ఆఫ్ ఫేమ్.. రాహుల్ ద్రవిడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, జూలై 2: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ది వాల్ రాహుల్ ద్రవిడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్‌లో కనబర్చిన ప్రతిభ, అందిస్తోన్న సేవలకు గుర్తింపుగా ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ పురస్కారం ప్రకటించింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మూడుసార్లు ప్రపంచకప్ సాధించిన సారథి రికీ పాంటింగ్, ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ మాజీ వికెట్ కీపర్ క్లేరీ టేలర్‌కూ చోటుదక్కింది. డబ్లిన్‌లో ఆదివారం ఐసీసీ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జాబితాను ప్రకటించారు. ఈ గౌరవాన్ని అందుకున్న భారతీయ క్రెకెటర్లలో రాహుల్ ఐదోవాడు. ఇంతకుముందు బిషన్ సింగ్ బేడి, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లేలు ఈ అరుదైన గౌరవం దక్కించుకున్నారు.
ఆస్ట్రేలియా ఆటగాళ్లలో పాంటింగ్ 25వ వాడైతే, ఇంగ్లాండ్ నుంచి క్లేరీ టేలర్ మూడో వ్యక్తిగా ఈ గౌరవాన్ని అందుకుంటున్నారు. ‘ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటుదక్కడం నేను చేసుకున్న అదృష్టం. క్రికెట్‌కు సేవలందిచిన ప్రపంచ ప్రముఖుల జాబితాలో నా పేరుండటం మహదానందం. కెరీర్‌ను ముగించిన ప్రతి ఆటగాడూ ఇలాంటి గుర్తింపు కోసం కలగంటాడు. నా కల నెరవేరింది’ అంటూ ద్రవిడ్ పేర్కొన్నట్టు ఐసీసీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ‘నా ఉన్నతికి సాయపడిన, ప్రోత్సహించిన కుటుంబం, స్నేహితులు, సహచరులు, కోచ్‌లు.. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఏళ్ల తరబడి క్రికెట్ కెరీర్ కొనసాగించేందుకు సహకరించిన ఐసీసీ, బీసీసీఐ, కేఎస్‌సీఏకూ ధన్యవాదాలు’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు. 164 టెస్ట్‌ల్లో 36 శతకాలతో 13,288 పరుగులు, 344 వనే్డల్లో 12 శతకాలతో 10,889 పరుగులు ద్రవిడ్ సాధించడం తెలిసిందే. ప్రస్తుతం భారత అండర్ 19, భారత-ఎ జట్లకు ద్రవిడ్ కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. హాల్ ఆఫ్ ఫేమ్‌లో గుర్తింపునిచ్చిన ఐసీసీకి రికీ పాంటింగ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు. ‘కోచ్‌లు, సహచరులు, అధికారులు, స్నేహితుల సహకారం లేకుండా ఇలాంటి అరుదైన గౌరవాలు దక్కించుకోలేం. ముఖ్యంగా సరైన మార్గదర్శకత్వంతో నన్ను ముందుకు నడిపించిన కుటుంబం సహా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు’ అని వ్యాఖ్యానించాడు.