క్రీడాభూమి

డెన్మార్క్ ఢమాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజ్ని నోవ్‌గొరోడ్ (రష్యా), జూలై 2: ఫిఫా ప్రపంచకప్ 2018లో ఆదివారంనాటి రెండు మ్యాచ్‌లూ సారూప్యత, సంచలనాలతో ముగిశాయ. పెనాల్టీ షూటౌట్ల ఫలితాలతో రెండు జట్లు క్వార్టర్స్‌కు చేరితే, రెండు జట్లు నిష్క్రమించాయి. మాజీ చాంపియన్ స్పెయిన్ ప్రీక్వార్టర్స్ నుంచి నిష్క్రమించటం సంచలనమైతే, ఆతిథ్య రష్యా క్వార్టర్స్‌కు చేరుకోవడమూ సంచలనమే. రష్యా 4-3 తేడాతో స్పెయిన్‌ను ఇంటిముఖం పట్టించటం తెలిసిందే. ఇక రెండో మ్యాచ్‌లో డెన్మార్క్‌కు షాకిచ్చిన క్రొయేషియా 3-2తో ఇంటికి పంపేసింది. అటు స్పెయిన్ షూటౌట్లను సమర్థంగా ఎదుర్కొని రష్యా గోల్‌కీపర్ హీరోగా నిలిస్తే, ఇటు డెన్మార్క్ షూటౌట్లను తిప్పికొట్టి క్రొయేషియా గోల్‌కీపర్ డానిజెల్ సుబాసిక్ హీరోగా నిలిచాడు. మ్యాచ్ మొదలైన మూడు నిమిషాల్లోనే డెన్మార్క్ ఆటగాడు మతియాస్ జార్జిన్సన్ గోల్ సాధించటంతో ఆ జట్టు ఆధిక్యాన్ని సాధించింది. 4వ నిమిషం ముగియకముందే మారియో మాండ్జ్‌కిక్ గోల్ సాధించి స్కొరును డెన్మార్క్‌తో సమం చేశాడు. ఆట ముగిసే సమయానికి, అదనపు సమయంలో గోల్స్ నమోదుకాకపోవడంతో షూటౌట్ తప్పలేదు. షూటౌట్లో డెన్మార్క్ తరఫున సిమన్ జయిర్, మిఖాయిల్ క్రోన్లు చెరి రెండు గోల్స్ సాధిస్తే, క్రొయేషియా ఆటగాళ్లు ఆండ్రెజ్ క్రమారిక్, లుకా మాడ్రిక్, ఇవాన్ రాకిటిక్‌లు గోల్స్ సాధించి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లారు. ఒత్తిడికి గురైన డెన్మార్క్ తరువాత గోల్స్ సాధించలేక తడబడింది. దీంతో 3-2 తేడాతో క్రొయేషియా క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. 1998 తరువాత ప్రపంచకప్‌లో క్వార్టర్స్‌కు చేరడం క్రొయేషియాకు ఇదే మొదటిసారి. 2014 ప్రపంచకప్‌లో అర్జెంటీనా- నైజీరియా జట్లు నాలుగు నిమిషాల్లోనే గోల్స్ సాధించిన రికార్డు తరువాత క్రొయేషియా- డెన్మార్క్ మ్యాచ్‌లో తొలి నాలుగు నిమిషాల్లోనే రెండు జట్లు గోల్ చేయటం కనిపించింది.