క్రీడాభూమి

ద్రవిడ్ కుమారుడి శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 21: భారత క్రికెట్ జట్టుకు విశేష సేవలు అందించిన ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ అతని అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. అండర్-14 టైగర్ కప్ టోర్నీలో భాగంగా ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు యునైటెడ్ క్రికెట్ క్లబ్ తరఫున బరిలోకి దిగిన సమిత్ 125 పరుగులు సాధించాడు. ప్రత్యూష్ (143 నాటౌట్)తో కలిసి అతను 213 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. వీరి బ్యాటింగ్ ప్రతిభతో బెంగళూరు యునైటెడ్ 326 పరుగుల భారీ స్కోరు సాధించగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఫ్రాంక్ ఆంధోనీ జట్టు 80 పరుగులకే కుప్పకూలి, 246 పరుగుల తేడాతో చిత్తయింది.