క్రీడాభూమి

బ్రెజిల్.. జిగేల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమర ఎరెనా: ఊహించిన ఫలితమే ఎదురైంది. ప్రపంచకప్ రెండో రౌండ్‌లో బ్రెజిల్ జిగేల్ మనిపించింది. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ అనిపించుకున్న బ్రెజిల్ ముందు మెక్సికో నిలవలేకపోయింది. తుదివరకూ పోరాడిన మెక్సికో గోల్ సాధించకుండానే ఓటమిని అంగీకరించింది. 2-0తో విజయం సాధించిన బ్రెజిల్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. తొలి 20 నిమిషాల ఆటలో ప్రత్యర్థి మెక్సికో గోల్‌బాక్స్‌ను కనీసం టచ్ చేయని బ్రెజిల్, 9సార్లు తమ గోల్‌పోస్ట్‌పై దాడిచేసిన మెక్సికన్లను సమర్థంగా నిలువరించింది. 35 నిమిషాల సమయానికి బ్రెజిల్ ఫార్వార్డ్ నేమార్ మూడుసార్లు గోల్ కోసం ప్రయత్నించినా ఫలితం మాత్రం దక్కలేదు. మ్యాచ్ ప్రథమార్థంలో బ్రెజిల్‌ను ఎదుర్కోడానికి మెక్సికో జట్టు సబ్‌స్టిట్యూట్‌లను మార్చుకుంటూ వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. బ్రెజిల్ గోల్‌పోస్టుపై అదేపనిగా మెక్సికో దాడులు చేసినా, గోల్ పోస్టులోకి పంపడంలో మాత్రం పూర్తిగా విఫలమైంది. దీంతో ప్రథమార్థం ముగిసేసరికి రెండు జట్లకూ ఒక్క గోల్ కూడా దక్కలేదు. ద్వితీయార్థంలోనూ సబ్‌స్టిట్యూట్లను దింపుతూ మెక్సికో వ్యూహాత్మకంగానే పోరు సలిపినా బ్రెజిల్ ఏమాత్రం బెదిరిపోలేదు. మెక్సికోను నిలువరిస్తూనే అదును కోసం ఎదురు చూసింది. బ్రెజిల్ నిరీక్షణ 51వ నిమిషంలో ఫలించింది. మెక్సికో రక్షణ శ్రేణిని చేధిస్తూ బ్యాక్ పోస్టు నుంచి నేమార్ తన్నిన లోడ్రైవ్ నేరుగా మెక్సికో గోల్ పోస్టులోకి వెళ్లిపోయింది. దీంతో బ్రెజిల్ 1-0 ఆధిక్యానికి చేరుకుంది. వరల్డ్‌కప్ టోర్నీలో కేవలం 38 షాట్లలో నేమార్ ఆరు గోల్స్ సాధించాడు. మెస్సీ 67 షాట్లు, క్రిస్టియానో రొనాల్డో 74 షాట్లలో సాధించిన స్కోరుతో సమం చేశాడు.
తీవ్ర వత్తిడికి గురైన మెక్సికో వేగంగా సబ్‌స్టిట్యూట్లను దింపుతూ అటాకింగ్ గేమ్‌కు ప్రయత్నించింది. అదే వ్యూహాన్ని బ్రెజిల్ సైతం అనుసరిస్తూ ప్రత్యర్థిపై పట్టు పెంచటంతో మెక్సికో డిఫెన్స్ చిన్నాభిన్నమైంది. 86వ నిమిషంలో బ్రెజిల్ మిడ్‌ఫీల్డర్ ఫిలిప్పీ కౌంటినో స్థానంలోకి దిగిన రాబర్డో ఫెర్మినో 88వ నిమిషంలోనే గోల్ సాధించడంతో ఇక బ్రెజిల్ ఆధిక్యతకు తిరుగులేకుండా పోయింది. నిజానికి నేమార్ తన్నిన లోషాట్‌ను మెక్సికో ఆటగాడు ఓకావో అడ్డుకున్నాడు. అప్పటికే చేజ్ చేస్తున్న ఫెర్మినో బంతిని నేరుగా గోల్‌పోస్టులోకి తన్ని మెక్సికోను ఓటమి అంచుల్లోకి పంపాడు.
నిర్ణీత సమయం పూర్తికావడం, ఇంజ్యూరీ సమయంలోనూ మెక్సికో తన ప్రతాపాన్ని ప్రదర్శించలేకపోవడంతో సున్నా గోల్స్‌తో పరాజయాన్ని అంగీకరించింది. అద్భుత ప్రావీణ్యాన్ని ప్రదర్శించి మ్యాచ్ మొత్తానికి నేమార్ సెంటర్ అట్రాక్షన్ అయ్యాడు.