క్రీడాభూమి

ఆసియా గేమ్స్... భారత్ నుంచి 524 మంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 3: ఇండోనేసియాలోని జకార్తాలో ఈ ఏడాది ఆగస్టులో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే వివిధ క్రీడలకు సంబంధించి 524 మంది సభ్యులతో కూడిన బృందాన్ని భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది. 36 క్రీడాంశాలకు సంబంధించి 277 మంది పురుషులు, 247 మంది మహిళలున్నారు. 2014లో జరిగిన ఆసియా క్రీడల్లో కేవలం 28 క్రీడలకు సంబంధించి 541 మందిని ఎంపిక చేశారు. ఈసారి ఎనిమిది క్రీడాంశాలైన కరాటే, కురాష్, పెన్‌కాక్ సీలాట్, రోలర్ స్కేటింగ్, సంబో, సెపక్‌తక్రా, ట్రైథ్లాన్‌తో పాటు స్వాఫ్ట్ టెన్నిస్‌లకు అవకాశం కల్పించారు. అంతేకాకుండా అర్చరీ, అథ్లెటిక్స్, బాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, కానోయ్-కాయాక్ (స్ప్రింట్), కానోయ్-కాయాక్ (స్లాలోమ్), సైక్లింగ్, ఈక్వేస్ట్రియన్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్, గోల్ఫ్, హ్యాండ్‌బాల్, హాకీ, జూడో, కబడ్డీ, రోయింగ్, సెయిలింగ్, షూటింగ్, స్క్వాష్, ఆక్వాటిక్స్-స్విమ్మింగ్, ఆక్వాటిక్స్-డైవింగ్, టెన్నిస్, తైక్వాండో, ట్రైథ్లాన్, స్వాఫ్ట్ టెన్నిస్, టెబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, ఉషూ క్రీడలకు సంబంధించిన జట్టును ఎంపిక చేశామని ఐఓఏ తెలిపింది. ఆసియా క్రీడలు ఇండోనేసియాలో ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు జరుగుతాయి. 2020 టోక్యో ఒలింపిక్ క్రీడలను దృష్టిలో పెట్టుకుని ముందుగా కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖకు సమర్పించిన 2370 మంది క్రీడాకారుల జాబితాను ఐఓఏ సమర్పించింది.
అయితే వీరిలో ఒలింపిక్ క్రీడలను పరిగణలోకి తీసుకుని 524 మందితో కూడిన తుది జట్టును ఒలింపిక్ సంఘం మంగళవారం ప్రకటించింది.