క్రీడాభూమి

భళా.. బెల్జియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోస్టోవ్, జూలై 3: ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ రౌండ్‌లో అంచనాలకు అందని ఆనందం అభిమానులకు అందుతోంది. అంచనాలకు అందని మ్యాచ్‌లు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. సోమవారం అర్థరాత్రి రోస్టోవ్ ఎరెనా స్టేడియంలో జపాన్- బెల్జియం మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. అనూహ్య మలుపుతో బెల్జియం విజయం సాధిస్తే, ఒకే ఒక్క ఆసియా జట్టు జపాన్ మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించింది.
చావో రేవో తేల్చుకోడానికి బరిలోకి దిగిన రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డారు. ప్రథమార్థంలో సాగిన రసవత్తర పోరులో ఇద్దరికీ గోల్స్ దక్కలేదు. ద్వితీయార్థం ఆరంభంలోనే జపాన్ తన సత్తా చాటింది. 48వ నిమిషంలో మిడ్‌ఫీల్డర్ జెంకీ హరగుచి గోల్ సాధించడంతో జపాన్ 1-0 ఆధిక్యానికి చేరింది. వత్తిడికి గురైన బెల్జియంపై మరింత పట్టు సాధిస్తూ 52వ నిమిషంలో మిడ్‌ఫీల్డర్ టకాషి ఇనుయ్ మరో గోల్ సాధించడంతో జపాన్ 2-0 ఆధిక్యానికి చేరింది. అయితే, జపాన్ ఆటగాళ్ల ఉత్సాహానికి బెల్జియం ఏమాత్రం బెదరలేదు. చాన్స్ కోసం ఎదురుచూసిన బెల్జియంకు 69వ నిమిషంలో అవకాశం దక్కింది. డిఫెండర్ జాన్ వెర్టోన్‌గన్ సాధించిన గోల్‌తో బెల్జియం 1-2కు చేరింది. అటాకింగ్ గేమ్‌కు దిగిన బెల్జియానికి 74వ నిమిషంలో వౌరోనో ఫిల్లైని మరో గోల్ అందించి స్కోరును సమం చేశాడు. ఆధిక్యం కోసం రెండు జట్లూ శ్రమకోడ్చినా ఫలితం లేకపోయింది. అప్పటికే సబ్‌స్టిట్యూట్‌గా దిగిన బెల్జియం ఆటగాడు నాసర్ చడ్లీ ఇంజ్యురీ (90+4) టైంలో గోల్ సాధించడంతో బెల్జియం 3-2కు చేరింది. చివరి నిమిషంలో అద్భుతమైన గోల్‌తో బెల్జియం తలరాతను మార్చేసిన చడ్లీ హీరోగా నిలిచాడు. చివరి నిమిషంలో అవకాశం చేజారిపోవడంతో జపాన్ టోర్నీనుంచి నిష్క్రమించింది. క్వార్టర్స్‌లో శుక్రవారం టైటిల్ ఫేవరేట్ బ్రెజిల్‌తో బెల్జియం తలపడనుంది.

గర్వంగా ఉంది....
2-0తో జట్టు విజయం సాధించడం గర్వంగా ఉంది. సబ్‌స్టిట్యూట్ నాసర్ చడ్లీ నిర్ణయాత్మక గోల్ సాధించడం బెల్జియం జట్టు పటిష్టతకు నిదర్శనం. ఫిఫా ప్రపంచకప్ పోరులో బెల్జియం ఆటగాళ్లను చూసి చాలా గర్వపడే రోజిది. నిజానికి మ్యాచ్‌లో జపాన్ తొలి గోల్ సాధించడం అద్భుతమైన కౌంటర్ అటాక్. అయితే, మా జట్టు తడబడలేదు. సహనాన్ని కోల్పోకుండా ఆటపై దృష్టిపెట్టడం వాళ్ల అనుభవాన్ని, రాణింపును స్పష్టం చేస్తోంది. ఏదేమైనా ఇలాంటి మరపురాని రోజులు ఈ ప్రపంచకప్‌లోనే మరిన్ని దక్కుతాయి.

ఓటమి నిజం
జపాన్ తీవ్ర దిగ్బ్రాంతికి గురైన రోజు. కానీ, ఓటమి నిజం. మా జట్టు ఎంత అద్భుతంగా ఆట మొదలెట్టిందో, ప్రత్యర్థి జట్టు అంతే అద్భుతంగా ఆటను ముగించింది. 94వ నిమిషంలో నసెర్ చడ్లీ స్ట్రయికింగ్‌ను ఊహించలేకపోయాం. జపాన్ 2-0 ఆధిక్యంలో ఉన్నపుడు నేను ఆటగాళ్లను మార్చలేదు. బంతిని నియంత్రణలోకి తెచ్చుకున్న మా జట్టు మరో గోల్ సాధిస్తుందనుకున్నా. కానీ, అంచనాలకు భిన్నంగా బెల్జియం ఆడింది. చివరి క్షణాల్లో జరిగిన ఒకటి రెండు పొరబాట్లు మొత్తం ఫలితానే్న మార్చేసింది.