క్రీడాభూమి

ట్యాంపరింగా..తాట తీస్తారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, జూలై 3: ఇకముందు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడే క్రికెటర్లపై కఠిన శిక్షలు అమలు చేయనున్నారు. డబ్లిన్‌లో జరిగిన వార్షిక సమావేశ ముగింపులో ఈమేరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. బాల్ ట్యాంపరింగ్‌పై అధికారులు, కమిటీలు సూచించిన వివిధ అంశాలను ఐసీసీ పాలక కమిటీ ఆమోదించింది. ఈ నిర్ణయం ప్రకారం.. బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడే క్రికెటర్ల ఖాతాలో 12 డీమెరిట్ పాయింట్లు జమ చేస్తారు. అంతేకాకుండా ఆరు టెస్టు మ్యాచ్‌లలో లేదా 12 అంతర్జాతీయ వనే్డల్లో ఆడకుండా నిషేధం విధిస్తారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడినా, మైదానంలో ఆడుతున్నపుడు ప్రవర్తన సరిగా లేకున్నా శిక్షలు మరింత కఠినంగా ఉంటాయి. ఈ ఏడాది మార్చిలో కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టుమ్యాచ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు రుజువైన నేపథ్యంలో ఇటీవల కాలం వరకు అమలులో ఉన్న నిబంధనలను మరింత కఠినతరం చేశారు. వ్యక్తిగత దూషణలకు పాల్పడడం, అసభ్యకరంగా వ్యవహరించడం, అంపైర్ ఆదేశాలను ధిక్కరించడం లేదా ఉల్లంఘించడం వంటివి ఇంతవరకు లెవెల్-1, లెవెల్-2గా పరిగణించేవారు. స్వప్రయోజనాల కోసం ప్రయత్నించడం, మోసగించడం వంటి అంశాలను ఇపుడు లెవెల్-3 కింద తీసుకొచ్చారు. అదేవిధంగా ఆటగాళ్లు లేదా వారికి సంబంధించిన సిబ్బంది అంపైర్ నిర్ణయంపై అపీల్‌కు వెళ్లాలనుకుంటే ఇంతవరకు ముందుగానే నిర్ణీత ఫీజు చెల్లించాల్సి వచ్చేది. అపీల్‌లో విజయం సాధిస్తే ఆ ఫీజులు తిరిగి ఇచ్చేవారు. ఇకముందు అలాంటి పరిస్థితి ఉండబోదు. అదేవిధంగా ఆటగాళ్ల ప్రవర్తనపై సంబంధిత బోర్డు మెంబర్‌ను బాధ్యుడిని చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఇదిలావుండగా, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, సూచనలు, సలహాలకు తమ బోర్డు డైరెక్టర్లంతా ఏకగ్రీవంగా మద్దతు తెలపడం ద్వారా క్రీడారంగాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు మద్దతు తెలిపామని ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ తెలిపాడు.