క్రీడాభూమి

వన్.. స్వీడన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయంట్ పీటర్స్‌బర్గ్, జూలై 3: వాళ్లిద్దరి మధ్య ఫుట్‌బాల్ పోరు కొత్తకాదు. ఇప్పటికి 29సార్లు ఢీకొన్నారు. కానీ, ప్రపంచకప్ మైదానంలో తలపడటం మాత్రం ఇదే ప్రథమం. అందుకే చావో రేవో తేల్చుకోడానికి హోరాహోరీకి దిగారు. ఆ రెండు జట్లే స్వీడన్ -స్విట్జర్లాండ్. స్విస్ ఆటగాళ్లతో ఆడిన మ్యాచ్‌ల్లో గత మూడుదఫాలుగా విజయాలను నమోదు చేసిన అనుభవం స్వీడన్‌ది. విజయాలు నమోదు చేసిన అనుభవం లేకపోయినా, తుది ఎనిమిది జట్లలో ఎలాగైనా స్థానం సంపాదించాలన్న కసితో మైదానంలోకి దిగిన జట్టు మరొకటి. ఒకరు స్వీడన్. మరొకరు స్విట్జర్లాండ్. మంగళవారం సెయింట్ పీటర్స్‌బర్గ్ మైదానంలో రెండు జట్లు తలపడ్డాయి. కానీ, తడబాటులేకుండా స్వీడన్ నిలబడింది. అలవాటుగా స్విట్జర్లాండ్ ఓడిపోయి ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. ఒకరిపై ఒకరు పట్టుకోసం రెండు జట్లూ అలుపెరుగని పరుగులు తీశాయి. ఆరంభంలోనే బంతిని తన నియంత్రణలోకి తెచ్చుకున్న స్విట్జర్లాండ్ అదేపనిగా స్వీడన్ గోల్‌పోస్టులపై దాడులకు దిగింది. ఒకదశలో స్విస్‌ను నిలువరించటం స్వీడన్‌కు కాళ్లకు మించిన పనే అయ్యింది. అయితే, హోరాహోరీ పోరులో ప్రథమార్థం ముగిసేసరికి ఏ జట్టూ గోల్ సాధించలేదు. ద్వితీయార్థంలో రెండు జట్ల ఆటగాళ్లు మరింత కసి ప్రదర్శించారు. ఎలాగైనా గోల్ సాధించాలన్న స్వీడన్ కృషి 66వ నిమిషంలో ఫలించింది. మిడ్‌ఫీల్డర్ ఎమిల్ ఫోర్స్‌బర్గ్ నేరుగా చేసిన గోల్‌తో స్వీడన్ 1-0 ఆధిక్యానికి చేరింది. ప్రపంచకప్‌లో 14 షాట్లు సంధించిన తరువాత ఫోర్స్‌బర్గ్ సాధించిన తొలి గోల్ ఇది. ఈ గోల్‌తోనే ఆట అనూహ్యంగా మారిపోయింది. పరిస్థితిని తమ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు అటు స్విస్, ఇటు స్వీడన్లు చకచకా సబ్‌స్టిట్యూట్లను దింపడం మొదలెట్టాయి. ద్వితీయార్థంలోనూ అదే పనిగా స్వీడన్ గోల్‌పోస్టులపై స్విస్ దాడులు చేసింది. నిర్ణీత సమయంతోపాటు ఇంజ్యురీ టైంలోనూ స్విస్ గోల్స్ సాధించలేకపోడంతో ఆటగాళ్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. మిడ్‌ఫీల్డర్ గ్రానిట్ గ్జకా ఎల్లో కార్డు అందుకుంటే, డిఫెండర్ మిఖాయిల్ లాంగ్ ఏకంగా రెడ్‌కార్డునే అందుకోవాల్సి వచ్చింది. మ్యాచ్‌టైం పూర్తికావడంతో స్వీడన్ 1-0తో స్విస్‌పై విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరుకుంది. ఓటమితో స్విట్జర్లాండ్ మాత్రం ప్రపంచకప్‌నుంచి నిష్క్రమించింది.