క్రీడాభూమి

ఫాస్టెస్ట్ 2000

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్, జూలై 4: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు మంగళవారం రాత్రి ఆతిధ్య జట్టుతో జరిగిన తొలి టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో కోహ్లీ ఫాస్టెస్ట్‌గా రెండు వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. కోహ్లీ కేవలం 56 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించాడు. టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఇప్పటివరకు ముగ్గురు క్రికెటర్లు మాత్రమే రెండువేల పరుగుల క్లబ్‌లో చేరారు. న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గుప్తిల్ (73 ఇన్నింగ్స్‌లో 2271 పరుగులు) మొదటి స్థానంలో నిలిచాడు. అదే దేశానికి చెందిన మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ (71 ఇన్నింగ్స్‌లో 2140 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ (59 ఇన్నింగ్స్‌లో 2000 పరుగులు) మూడో స్థానంలో నిలిచాడు. అయితే, కోహ్లీ ఈ ముగ్గురు ఆటగాళ్లకంటే తక్కువగా అంటే కేవలం 56 ఇన్నింగ్స్‌లోనే రెండువేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టీ-20లలో అత్యధిక సెంచరీల (35) రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. ఇంతవరకు 208 వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 9588 పరుగులు చేశాడు.