క్రీడాభూమి

ఇంగ్లాండ్‌పై భారత్ బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్, జూలై 4: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత ఎడమచేతి మణికట్టు మాంత్రికుడు కుల్దీప్‌యాదవ్ జట్టు గెలుపులో కీలక భూమిక పోషించాడు. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. అందుకు ధీటుగా విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత్ 18.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 163 పరుగులు చేయడం ద్వారా మూడు టీ-20ల సిరీస్‌లో ప్రారంభ మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో 24 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసిన టీమిండియా స్పిన్నర్ కుల్దీప్‌యాదవ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.