క్రీడాభూమి

లాస్ ఏంజిల్స్‌లో ‘లాటా’ మినీ ఒలింపిక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 4: అమెరికాలోని లాస్ ఏంజిల్స్ తెలుగు అసోసియేషన్ (లాటా) ఆరువారాలపాటు నిర్వహించిన మినీ ఒలింపిక్స్ విజయవంతమయ్యాయి. మే 26న ప్రారంభమైన పోటీలు జూలై 1న ముగిశాయి. క్రికెట్, వాలీబాల్, టెన్నిస్, టెన్నీకాయిట్, చెస్, క్యారమ్స్, స్విమ్మింగ్, రన్నింగ్ వంటి పోటీల్లో పిల్లలు నుంచి పెద్దల వరకు దాదాపు 1100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇంత పెద్దఎత్తున ఇలాంటి క్రీడా పోటీలను ఒక ఎన్‌ఆర్‌ఐ తెలుగు సంస్థ నిర్వహించడం ఇదే తొలిసారి. ఇర్వైన్, ఈస్ట్‌వెల్, వాలెన్సియా, టోరెంస్, సైప్రస్, బర్ బ్యాంకు, బ్యుయనా పార్క్, ఆర్కేడై నగరాల్లో నిర్వహించిన ఈ పోటీలను 145 మంది కార్యకర్తలు పర్యవేక్షించారు. నేటి బాలలే రేపటి విజేతలు అనే సంకల్పంతో నిర్వహించిన ‘లాటా’ మినీ ఒలింపిక్స్‌కు మరింత విశిష్టత చేకూరింది. ఈ పోటీలను ఏటా ఇదేవిధంగా జరపాలని పిల్లలు, తల్లిదండ్రులు కోరడం విశేషం. త్వరలో అందర్నీ అలరించే విధంగా మినీ ఒలింపిక్స్ విజయోత్సవాలు నిర్వహించనున్నట్టు ‘లాటా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు ఆఫ్ డైరెక్టర్ తెలిపారు.