క్రీడాభూమి

మాంత్రిక మార్జాలం కన్నుమూసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూలై 5: అది ఆషామాషి మన ఇళ్లల్లో తిరిగే పిల్లి కాదు. చైనాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానుల ప్రేమను చూరగొన్న పిల్లి. వరల్డ్ కప్ గేమ్స్‌లో ఏ దేశం గెలుస్తుందో ముందుగా జోస్యం చెప్పే పిల్లి. దీంతో ఆ పిల్లికి వీరాభిమానులు ఉన్నారు. కానీ పిల్లి కూడా ఒక జీవే. ఆ పిల్లి బీజింగ్‌లో తాను ఉంటున్న ఆర్కియాలజీ ప్యాలెస్‌లో మరణించింది. దీంతో సామాజిక మాధ్యమాల ద్వారా చైనా తదితర దేశాల్లో ఆ మార్జాలానికి నివాళులు అర్పిస్తున్నారు. తెగ సంతాపాలు వచ్చి పడుతున్నాయి. ఈ పిల్లి పేరు బైదనెర్. బీజింగ్‌లోని పాలెస్ మ్యూజియంలో ఉంటుంది. ఆరు వరల్డ్ కప్ గేమ్స్‌లో ఎవరు విజేతలుగా నిలుస్తారో చెప్పిన ఘన చరిత్ర ఈ పిల్లికి ఉంది. రెండు బౌల్స్‌లో ఆహారం పెట్టి పోటీలో తలపడే రెండు దేశాల జెండాలను ఆ బౌల్స్‌లో ఉంచేవారు. ఆ పిల్లి ఏ బౌల్ వద్దకు ముందుగా వస్తే ఆ జట్టు గెలిచేదంట. ఇందులో నిజమెంతో, అబద్ధమెంతో తెలియదు కాని అదో సెంటిమెంట్. ఇంతకీ ఆ పిల్లి గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురై ప్రాణం విడిచింది. ఈ పిల్లిపేరు మీద తెరిచిన వెబ్‌సైట్లో ఇంతవరకు పదివేల మంది నివాళులు అర్పిస్తూ కామెంట్లు చేశారు. ఈ ప్యాలెస్‌కు వెళ్లినా ఈ పిల్లిని చూసేవాళ్లమని, ఎంచక్కా గడ్డి మైదానంలో పడుకుని ఉండేదని అభిమానులు బాధను వ్యక్తం చేశారు. ఇటీవల జపాన్‌లో రెబియోఅక్టోపస్ అనే జోస్యం చెప్పే జలచర జీవిని అమ్మేసి చంపేసి తినేశారు. ఈ ఆక్టోపస్ జపాన్ అనేక మ్యాచ్‌ల్లో గెలుస్తుందని జోస్యం చెప్పిందంట. 2010లో జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో విజేత ఎవరూ కచ్చితంగా ముందుగా పాల్ ఆక్టోపస్ సూచించిన విషయం విదితమే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పాల్ ఆక్టోపస్‌కు మీడియాలో విశేష ప్రచారం లభించింది. జర్మనీలో ఈ ఆక్టోపస్ అప్పట్లోనే మరణించింది. ఏమైనా జోస్యం చెప్పే మూగజీవాలు మృత్యువాత పడడంపై సెంటిమెంట్ ఉన్న ప్రజలు బాధపడుతున్నారు.