క్రీడాభూమి

క్వార్టర్ ఫైనల్‌కు సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, జూలై 5: ఇండోనేసియా ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ విజేత పీవీ సింధు, ప్రణయ్ క్వార్టర్ ఫైనల్స్‌కు ప్రవేశించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్ ఫైనల్లో వరల్డ్ నెంబర్-3 క్రీడాకారిణి, 23వ జన్మదిన వేడుకలు జరుపుకున్న సింధు 21-17, 21-14 స్కోరు తేడాతో ప్రత్యర్థి, జపాన్‌కు చెందిన 17 ర్యాంకర్ అయా ఓహారిపై విజయం సాధించింది క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 36 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు చక్కటి ఆటతీరును ప్రదర్శించి రెండు సెట్‌లలో ఆధిక్యతను కనపరిచి బర్త్‌డే రోజు విజయం సాధించడం విశేషం. పురుషుల సింగిల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత షట్లర్ ప్రణయ్ 21-23, 21-15, 21-13 స్కోరు తేడాతో ప్రత్యర్థి, చైనాకు చెందిన వరల్డ్ నంబర్ 17 క్రీడాకారుడు వాంగ్ జూ వెయిపై విజయం సాధించాడు. గంట పాటు సాగిన ఈ మ్యాచ్ మొదటి సెట్‌లో ప్రణయ్ 21-23 స్కోరుతో ఓటమి పాలైనప్పటికీ మిగతా రెండు సెట్‌లలో 21-15, 21-13 స్కోరుతో విజయం సాధించాడు.