క్రీడాభూమి

టార్గెట్ టోక్యో 2020

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 6: టోక్యో 2020 ఒలింపిక్‌లో నేరుగా ప్రవేశమే లక్ష్యంగా భారత మహిళా హాకీ జట్టు ప్రణాళికలు రచిస్తోంది. ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2వరకు ఇండోనేసియాలో జరగనున్న ఆసియన్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించడమే లక్ష్యంగా సాధనకు మెరుగులు దిద్దుకుంటోంది. ఆసియాన్ బరిలోకి దిగనున్న 18మంది సభ్యుల జట్టును హాకీ ఇండియా ఇటీవలే ప్రకటించడం తెలిసిందే. కెప్టెన్‌గా స్ట్రైకర్, ఫార్వార్డ్ రాణిరాంపాల్, వైస్ కెప్టెన్‌గా గోల్‌కీపర్ సవితల సారథ్యంలో ఆసియాన్‌లో పతకమే లక్ష్యంగా జట్టు సాధన చేస్తోంది. గత ఏడాది తొమ్మిదో ఆసియా కప్‌లో రాణిరాంపాల్ నాయకత్వంలో అద్వితీయ ప్రతిభ కనబర్చి కప్ సాధించడంతో, ఈసారీ ఆ బాధ్యతను రాణిరాంపాల్‌పైనే పెట్టడం తెలిసిందే. గత ఏడాది ఆసియా కప్, 2016లో ఆసియాన్ చాంపియన్స్ ట్రోఫీ, 2018లో రన్నర్స్ ఆఫ్‌గా నిలిచిన భారత మహిళా హాకీ ఈసారీ స్వర్ణాన్ని కైవసం చేసుకోవాలంటే చైనా, కోరియా జట్లపై తన ఆధిపత్యాన్ని కనబర్చాల్సి ఉంది. ఇదే విషయంపై జట్టు ఛీప్ కోచ్ మర్చినే మాట్లాడుతూ ‘ప్రస్తుతం జట్టు అన్నివిధాలా బలంగా ఉంది. మా దృష్టి మొత్తం లండన్‌లో జరుగనున్న ప్రపంచకప్ టోర్నీపైనే ఉంది’ అన్నాడు.
భారత హాకీ జట్టు: గోల్ కీపర్లు సవిత (వైస్ కెప్టెన్), రజనీ ఎటిమారుపు, డిఫెడర్లు దీప్ గ్రేస్ ఎక్కా, సునీతా లక్రా, దీపిక, గురుజిత్ కౌర్, రీనా ఖోఖర్, మిడ్ ఫీల్డర్లు నామిటాటోప్పో, లిలిమా మిన్జ్, మోనికా, ఉడిత, నిక్కిప్రధాన్, నేహాగోయాల్, ఫార్వార్డులు రాణిరాంపాల్ (కెప్టెన్), వందనా కోటారియా, నవనీత్ కౌర్, నవజ్యోత్ కౌర్.