క్రీడాభూమి

హిప్ హిప్ హుర్రే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్టల్: ఇంగ్లాండ్‌తో జరిగిన టీ-20 సిరీస్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత్ రెండో మ్యాచ్‌ను జారవిడుచుకున్నా చివరి మ్యాచ్‌లో 2-1తో ఇంగ్లాండ్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. రోహిత్ శర్మ సెంచరీ, హార్దిక్ పాండ్య మెరుపులతో ప్రత్యర్థి నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఆతిధ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 198 పరుగులు సాధించి భారీ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. అందుకు ప్రతిగా భారత్ 18.4 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. టీమిండియాలో గాయపడిన భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్ స్థానంలో దీపక్ చాహర్, సిద్దార్ధ కౌల్‌ను జట్టులోకి తీసుకుంది. ఇంగ్లాండ్ జో టూర్‌కు విశ్రాంతినిచ్చి అతని స్థానే బెన్ స్టోక్స్‌ను జట్టులో తీసుకుంది. తొలుత టాస్ గెలిచిన భారత్ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించడంతో ఓపెనర్లు జాసన్ రాయ్, జొస్ బట్లర్ చెలరేగి ఆడారు. మ్యాచ్ ఆరంభం నుండే ధాటిగా ఆడడంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఒకవైపు స్కోరు బోర్డు అమాంతం పెరుగుతుంటే భారత బౌలర్లు వికెట్లు తీయడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఫలితంగా ప్రత్యర్థికి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. వికెట్ కీపర్ జొస్ బట్లర్ 21 బంతుల్లో ఏడు ఫోర్లతో 34 పరుగులు చేసి సిద్దార్ధ కౌల్ చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 31 బంతులు ఎదుర్కొన్న జాసన్ రాయ్ ఏడు సిక్సర్లు, నాలుగు బౌండరీలతో 67 పరుగులు చేశాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో మహేంద్ర సింగ్ ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తొమ్మిది బంతులు ఎదుర్కొని ఆరు పరుగులు చేసి హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చాడు. అలెక్స్ హేల్స్ 24 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, మూడు బౌండరీలతో 30 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో ధోని క్యాచ్ పట్టగా అలెక్స్ వెనుతిరిగాడు. హార్దిక్ పాండ్య వేసి ఒక ఓవర్‌లోని తొలి బంతికి కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆఖరి బంతికి అలెక్ హేల్స్ ఔటయ్యారు. 10 బంతులు ఎదుర్కొన్న బెన్ స్టోక్స్ రెండు ఫోర్లతో 14 పరుగులు చేయగా హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టడంతో తిరుగుముఖం పట్టాడు. జానీ బెయిర్‌స్టో 14 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 25 పరుగులు చేసి, హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. డేవిడ్ విల్లే రెండు బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసి ఉమేష్ యాదవ్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. నాలుగు బంతులు ఎదుర్కొన్న లాల్ ప్లంకెట్ ఒక సిక్సర్‌తో తొమ్మిది పరుగులు చేసి సిద్దార్ధ కౌల్ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చాడు. క్రిస్ జోర్డాన్ మూడు బంతుల్లో మూడు పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఆడిల్ రషీద్ మూడు బంతుల్లో ఒక ఫోర్‌తో నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య నాలుగు ఓవర్లలో 38 పరుగులిచ్చి నాలుగు వికెట్లు, సిద్దార్ధ కౌల్ నాలుగు ఓవర్లలో 35 పరుగులిచ్చి రెండు వికెట్లు, దీపక్ చాహర్ నాలుగు ఓవర్లలో 43, ఉమేష్ యాదవ్ నాలుగు ఓవర్లలో 48 పరుగులిచ్చి చెరో వికెట్ తీసుకున్నారు. కాగా, టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 50 క్యాచ్‌లు (ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి టీ-20లో జాసన్ రాయ్ క్యాచ్) పట్టిన వికెట్ కీపర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా 37 ఏళ్ల ధోనీ తన కెరీర్‌లో ఇంతవరకు 93 టీ-20 మ్యాచ్‌లు ఆడి 54 క్యాచ్‌లు పట్టాడు. ఒక టీ-20 మ్యాచ్‌లో (ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ-20) ఐదు క్యాచ్‌లు పట్టిన ఘనత కూడా ధోనీదే.
ప్రత్యర్థి తమ ముందు ఉంచిన భారీ లక్ష్యాన్ని టీమిండియా సునాయాసంగా ఛేదించింది. స్టయిలిష్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ మూడు బంతుల్లో ఒక ఫోర్‌తో ఐదు పరుగులు చేసి డేవిడ్ విల్లీ బౌలింగ్‌లో జేక్ బాల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. టీ-20 తొలి మ్యాచ్‌లో సెంచరీతో జట్టును విజయపథంలో నిలిపిన విధ్వంసక బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ మూడో మ్యాచ్‌లో రాణించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో 10 బంతులు ఎదుర్కొన్న రాహుల్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 19 పరుగులు చేసి జేక్ బాల్ బౌలింగ్‌లో క్రిస్ జోర్డాన్‌కు క్యాచ్ ఇచ్చాడు. తొలి ఓపెనర్ రోహిత్ శర్మతో కలసి జట్టు స్కోరు పెంచే సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ 29 బంతులు ఆడి రెండు ఫోర్లు, మరో రెండు బౌండరీలతో 43 పరుగులు చేసి క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఆ తర్వాత మరో వికెట్ పడకుండా రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య సిక్సర్లు, బౌండరీలతో ప్రత్యర్థి బౌలర్లను తుత్తినియలు చేసి భారత్‌కు ఘన విజయాన్ని అందించారు. 56 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ ఐదు సిక్సర్లు, 11 బౌండరీల సహాయంతో శతకం నమోదు చేశాడు. (ఈ టీ-20 సిరీస్‌లో భారత్ తరఫున తొలి మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సెంచరీ నమోదు చేయగా, ఇపుడు ఆఖరి మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో శతకం బాదాడు). కోహ్లీ ఔటైన తర్వాత బరిలోకి దిగిన హార్దిక్ పాండ్య 14 బంతుల్లో రెండు సిక్సర్లు, నాలుగు బౌండరీల సహాయంతో 33 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ మూడు ఓవర్లలో 37, జేక్ బాల్ మూడు ఓవర్లలో 39, క్రిస్ జోర్డాన్ 3.4 ఓవర్లలో 40 పరుగులిచ్చి తలో వికెట్ తీసుకున్నారు.
జట్ల స్కోరు:
ఇంగ్లాండ్: (20 ఓవర్లలో 198/9) జాసన్ రాయ్ సి ధోనీ బి దీపక్ చాహర్ 57, జొస్ బట్లర్ బి సిద్దార్ధ కౌల్ 34, అలెక్స్ హేల్స్ సి ధోనీ బి హార్దిక్ పాండ్య 30, ఇయాన్ మోర్గాన్ సి ధోనీ బి హార్దిక్ పాండ్య 6, బెన్ స్టోక్స్ సి విరాట్ కోహ్లీ బి హార్దిక్ పాండ్య 14, జానీ బెయిర్‌స్టో సి ధోనీ బి హార్దిక్ పాండ్య 25, డేవిడ్ విల్లే బి ఉమేష్ యాదవ్ 1, క్రిస్ జోర్డాన్ రనౌట్ 3, లియామ్ ప్లంకెట్ సి ధోనీ బి సిద్దార్ధ కౌల్ 9, ఆదిల్ రషీద్ నాటౌట్ 4.
భారత్: (18.4 ఓవర్లలో 201/3) రోహిత్ శర్మ 100 నాటౌట్, విరాట్ కోహ్లీ సి అండ్ బి క్రిస్ జోర్డాన్ 43, హార్దిక్ పాండ్య 33 నాటౌట్, ఎల్‌కే రాహుల్ సి క్రిస్ జోర్డాన్ బి జేక్ బాల్ 19, శిఖర్ ధావన్ సి జేక్ బాల్ బి డేవిడ్ విల్లే 5.

చిత్రాలు..రోహిత్ శర్మ (మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ * మ్యాన్ ఆఫ్ ది సిరీస్)
ధోనీ (ఒక్క టీ-20 మ్యాచ్‌లో ఐదు క్యాచ్‌లతో రికార్డు *93 టీ-20ల్లో 54 క్యాచ్‌లతో మరో రికార్డు)