క్రీడాభూమి

హజార్డే హజార్డ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ పీటర్స్‌బర్గ్: కళ్లముందు గెలుపు కనిపిస్తున్నా, మనసు మూలల్లో తలత్తే చిన్న సందేహం చాలు కొంపముంచడానికి. ప్రపంచకప్‌లో ఫ్రాన్స్‌ను అప్రతిహతంగా నడిపిస్తున్న కోచ్ డిడెర్ డెస్‌చాంప్స్‌ను వెంటాడుతున్న చిరు సందేహమే -ఎడెన్. ప్రపంచకప్ కలకు సెమీస్ దూరంలో ఉంది ఫ్రాన్స్. సరిగ్గా ఇక్కడే పెద్ద ‘హజార్డ్’ను ఎదుర్కోబోతోంది. అతనే బెల్జియం ఫార్వార్డ్ ఎడెన్ హజార్డ్. ఫుట్‌బాల్ అంటే పడిచచ్చే కుటుంబంలో పుట్టినోడు. బెల్జియంలోని బ్రెయినే -లె- కామ్టె మున్సిపాల్టీ నుంచి ఎదిగినోడు. పధ్నాలుగేళ్లకే లిల్లే కంట మెరుపై మెరిసినోడు. ఆ రెండేళ్లకే లీగ్ 1 మ్యాచ్‌ల్లో సత్తా చూపించినోడు. ఇంగ్లాండ్‌లోని ఆరు సీజన్లలో రెండు లీగ్ టైటిళ్లు సొంత చేసుకున్నాడు. అంతులేని అభిమానుల్నీ సంపాదించాడు. ఎడెన్ చరిత్ర డిడెర్‌కు బాగా తెలుసు. అందుకే -అతన్ని ఎలా ఎదుర్కోవాలన్నదే ఇప్పుడు ఫ్రాన్స్‌కు పెను సవాల్. అదిసరే, ఆటగాడు ఎంత తోపైనా అసలు సమయంలో రాణించాలి. సెమీస్‌లో ఎడెన్ రాణింపు ఎలా ఉండబోతోందన్నదే అసలు పాయింటే. ఎందుకంటే, ఫిఫా ప్రపంచకప్‌లో లోకమెన్నిన దిగ్గజాలే దిక్కులేకుండా నిష్క్రమించిన ఉదంతాలున్నాయి. క్రిస్టియానో రొనాల్డో.. లయనెల్ మెస్సీ.. నేమార్‌లాంటి వీరులు చివరి క్షణాల్లో చేతులెత్తేడం అభిమానులు చూశారు. ఇక్కడ ఫ్రాన్స్ భయపడుతున్నట్టుగా ఎడెన్ విజృంభిస్తాడా? అన్నదీ పాయింటే. ఆ ఒక్కటే ఫ్రాన్స్‌ను కాస్త కుదుటపడేలా చేస్తోంది. రష్యాలో హజార్డ్ మిషన్ చిన్నదేం కాదు. ఈసారి చరిత్రను తిరగరాస్తామన్న నమ్మకం బెల్జియంలో కనిపిస్తుందంటే, కారణం జట్టులో ఎడెన్ హజార్డ్ ఉన్నాడు కనుకే. గాయాల నుంచి తేరుకుని వినె్సంట్ కంపెనీ జట్టులోకి అడుగుపెట్టినా, నాయకత్వ బాధ్యతలు ఎడెన్‌కే అప్పగించారంటే అతనిపై కోచ్ రాబెర్టో మార్టినెజ్‌కు ఎంత నమ్మకముందో అర్థం చేసుకోవచ్చు. ‘అతని ఉజ్వల కెరీర్‌కు సంబంధించి ఇవే అద్భుత క్షణాలు’ అంటూ కితాబునిస్తున్నాడు కూడా. ‘అతన్ని చూడండి. పిన్న వయసులోనే జట్టును ముందుకు నడిపించే నాయకత్వ బాధ్యతలు మోస్తున్నాడు. అలాగే ఏ సమయంలోనూ భారంగా భావించడం లేదు’ అంటూ మార్టినెజ్ ప్రశంసలందించాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో బ్రెజిల్‌ను బెల్జియం ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిందంటే అందుకు కారణం -కెప్టెన్‌గా హజార్డ్ సామర్థ్యం అన్నది జట్టు చెప్తోన్న మాట. ‘ఎంత వత్తిడిలోనైనా బంతిని నియంత్రణలో ఉంచగలడు. డిఫెండర్ల సహకారం విఫలమైనా బంతిని గోల్ పాయింట్‌కు తీసుకుపోగలడు. ఇంతకుమించి ఏం కావాలి?’ అంటున్నారు జట్టు సభ్యులు కూడా. 1998 ప్రపంచకప్ సమయంలో చిరుతలా కదిలిన ఫ్రెంచ్ ఆటగాడు జినెడైన్ జిడానే ఆటకు తీవ్రంగా ప్రభావితమైన హజార్డ్, ఇప్పుడు అతని స్థానాన్ని అందుకోడానికి కేవలం రెండు మ్యాచ్‌ల దూరంలోనే ఉన్నాడు. జిడానే పిక్క బలానికి ఫిదా అయి ఫుట్‌బాల్ గేమ్‌లోకి దిగిన హజార్డే, ఇప్పుడు అదే ఫ్రాన్స్ ఆటగాళ్లు పాల్ పోగ్బా, కిలియన్ ఎంబప్పె, ఆంటోనీ గ్రీజ్‌మన్‌ను నియంత్రించగలడన్న నమ్మకాన్ని బెల్జియం వ్యక్తం చేస్తోంది. అదే ఫ్రాన్స్ కోచ్ డిడైర్‌ను భయపెడుతున్న విషయం కూడా.