క్రీడాభూమి

క్రికెటర్ కౌర్ ఉద్యోగం ఊడింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత్‌సర్, జూలై 10: నకిలీ డిగ్రీ సర్ట్ఫికెట్లతో పంజాబ్ పోలీస్ శాఖలో డీఎస్పీ హోదాను దక్కించుకున్న భారత టీ-20 మహిళా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఉద్యోగం కోల్పోయింది. మహిళా క్రికెట్‌లో ఆమె రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడి 8.66 సరాసరిన 26 పరుగులు చేసింది. అయితే, 87 వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 35.41 సరాసరిన 2196 పరుగులు చేసింది. వీటిలో మూడు సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి. సిడ్నీ థండర్ బిగ్ బాష్ లీగ్‌లో (బీబీఎల్) 83 టీ-20లలో 1616 పరుగులు చేసింది. వీటిలో ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆల్‌రౌండర్‌గా పేరుతెచ్చుకున్న 29 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్ సాధించిన ఘనతతో పంజాబ్ ప్రభుత్వం ఆమెను ఈ ఏడాది మార్చి 1వ తేదీన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా నియమించి ఘనంగా సత్కరించింది. వాస్తవానికి ఆమె కేవలం 12వ తరగతి మాత్రమే పాసైంది. కానీ డిగ్రీ పాసైనట్టు మీరట్‌లోని చౌదరి చరణ్‌సింగ్ (సీసీఎస్) యూనివర్సిటీ నుంచి సర్ట్ఫికెట్లు అందజేసింది. అయితే, ఆమె సమర్పించిన డిగ్రీ సర్ట్ఫికెట్లపై పోలీస్ శాఖ ఉన్నతాధికారులు లోతుగా విచారణ చేపట్టారు. సదరు సీసీఎస్ యూనివర్సిటీలో హర్మన్‌ప్రీత్ కౌర్ పేరుగలవారెవరూ డిగ్రీ చదవలేదని అక్కడి అధికారులు స్పష్టం చేసింది. దీంతో ఆమె పోలీస్ శాఖకు సమర్పించిన డిగ్రీ సర్ట్ఫికెట్లు నకిలీవని రుజువు కావడంతో ఆమెను డీఎస్పీ పోస్టు నుంచి తొలగించారు. ఆమె 12వ తరగతి పాసైనందున, ఆమె సమర్పించిన డిగ్రీ సర్ట్ఫికెట్లు నకిలీవని అంగీకరిస్తే కానిస్టేబుల్ పోస్టులో నియమించే అవకాశం ఉందని సంబంధిత పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలావుండగా, హర్మన్‌ప్రీత్ కౌర్ పంజాబ్ పోలీస్ శాఖలో డీఎస్పీగా చేరకముందు రైల్వేలో ఉద్యోగం చేసిందని, అపుడు ఇవే డిగ్రీ సర్ట్ఫికెట్లు సమర్పించిందని, దానిపై ఎలాంటి అభ్యంతరం రాలేదని, కానీ డీఎస్పీ ఉద్యోగానికి అవి ఎలా నకిలీవి అవుతాయని ఆమె మేనేజర్ మీడియాను ప్రశ్నించాడు.