క్రీడాభూమి

అయిష్టంగా.. ఆశాజనకంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ పీటర్స్‌బర్గ్, జూలై 13: ‘మా వరకూ సాకర్ సమరం ముగిసింది. థర్డ్ ప్లేస్ ప్లే-ఆఫ్ మ్యాచ్ ఆడాలని ఏ జట్టూ కోరుకోదు. కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో దిగుతున్నాం’ అన్నాడు ఇంగ్లాండ్ మేనేజర్ గెరెత్ సౌత్‌గేట్. సెమీ ఫైనల్స్‌లో క్రొయేషియా చేతిలో ఓడిన ఇంగ్లాండ్, ఫ్రాన్స్ చేతిలో ఓటమిపాలైన బెల్జియంతో శనివారం ప్లే-ఆఫ్ ఆడబోతోంది. నిరాసక్తంగానే జట్టును సిద్ధంచేసిన ఇంగ్లాండ్ కోచ్ గెరెత్ మాట్లాడుతూ ‘నిజంగా చెప్పాలంటే ఈ మ్యాచ్ ఆడాలని ప్రపంచంలోని ఏ జట్టూ కోరుకోదు. నిజానికి అద్భుతమైన ఆట ప్రావీణ్యానే్న ప్రదర్శించాం. ఫలితం దక్కలేదు. జెర్సీ వేసుకున్న ప్రతిసారీ, ప్రతి ఆటగాడూ దేశం కోసమే ఆడతాడు. విజయం సాధించాలనుకుంటాడు’ అంటున్నాడు సౌత్‌గేట్. ఇదిలావుంటే, ప్రపంచకప్‌లో తృతీయ స్థానాన్నైనా దక్కించుకోవాలని రొబెర్టో మార్టినెజ్ జట్టు బెల్జియం తహతహలాడుతోంది. ‘మాది గోల్డెన్ జనరేషన్. మాకిది చాలా ముఖ్యమైన మ్యాచ్ కూడా. ఈ సాకర్ పోరులో మా పాత్రను ఉన్నతంగానే ముగించాలనుకుంటున్నాం. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని తృతీయస్థానంలోనైనా నిలబడాలన్నది మా ఆశ. ఇదే వచ్చే ప్రపంచకప్‌లో విజయానికి నాంది కావొచ్చు’ అంటూ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాడు రాబెర్టో మార్టినెజ్.