క్రీడాభూమి

రిటైరవుతున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: భారత జట్టులో పనె్నండేళ్లు కొనసాగిన మిడిల్ ఆర్డర్ కుడి చేతివాటం బ్యాట్స్‌మన్ మహ్మద్ కైఫ్ క్రికెట్‌లో అన్ని రకాల ఫార్మాట్‌ల నుంచి వైదొలుగుతున్నట్టు శుక్రవారం ప్రకటించాడు. 2002లో ఇంగ్లాండ్‌పై అంతర్జాతీయ వనే్డ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన మిడిల్ అర్డర్ బ్యాట్స్‌మన్ కైఫ్ మొత్తం 125 మ్యాచ్‌ల్లో 2753 పరుగులు సాధించి భారత జట్టులో మేటి బ్యాట్స్‌మన్‌గా నిలబడ్డాడు. 2002 జూలైలో ఇంగ్లాండ్‌తో జరిగిన నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్లో తోటి బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్‌తో కలిసి 75 బంతుల్లో రెండు సిక్సర్లు, ఆరు బౌండరీలతో 87 పరుగులు సాధించి తన వనే్డ కెరీర్‌లో మరచిపోని రోజుగా మలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కైఫ్‌తోపాటు బ్యాటింగ్‌లో రాణించిన యువరాజ్ సింగ్ 69 పరుగులు సాధించటంతో ఇంగ్లాండ్ ఇచ్చిన టార్గెట్ 326 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో మూడు పరుగులు ఉండాగానే చేధించింది. మహ్మద్ కైఫ్ నాయకత్వంలో భారత్ అండర్-19 జట్టు 2000లో ప్రపంచకప్ సొంతం చేసుకుంది.