క్రీడాభూమి

గోరంత తీపి కొండంత చేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూలై 16: ఓటమి బాధ పంటి బిగువన భరిస్తుంటే, బంగారు బంతి ఆనందం తియ్యగానే తోచిందని క్రొయేషియా కెప్టెన్ లుకా మాడ్రిక్ అన్నాడు. వ్యక్తిగత గుర్తింపు గోరంత తీపినిస్తే, ప్రపంచపోరులో ఓటమి కొండంత బాధ మిగిల్చిందని అభిప్రాయపడ్డాడు. ‘గుర్తింపును ఎవరు మాత్రం వద్దంటారు. సహజంగా ఎవరికైనా ఇష్టమే. ఉత్తమ ఆటగాడిగా ‘గోల్డెన్ బాల్’ గుర్తింపునివ్వడం ఆనందంగానే ఉంది. కాకపోతే, ప్రపంచకప్‌ను సాధించివుంటే దానికే ఎక్కువ ఆనందపడి ఉండేవాడిని’ అని వ్యాఖ్యానించాడు మాడ్రిక్. ‘ఇక్కడి వరకూ చేరుకోవడంపై గర్వపడుతున్నాం. ఫైనల్లో ఓటమితో బాధపడుతున్నాం’ అని వ్యాఖ్యానించాడు. గేమ్‌లో చిన్న చిన్న విషయాలే ఫ్రాన్స్‌కు కలిసొచ్చాయని, అవే చాంపియన్‌గా నిలబెట్టాయని మాడ్రిక్ విశే్లషించాడు.