క్రీడాభూమి

మాది వ్యూహాత్మక గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీడ్స్, జూలై 18: భారత్‌తో జరిగిన చివరి, మూడో వనే్డ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌ని వ్యూహాత్మకంగా ఆడి గెలిచామని ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అన్నాడు. మొదటి రెండు వనే్డల్లో భారత్, ఇంగ్లాండ్ చెరొక విజయంతో సమవుజ్జీలుగా నిలిచిన నేపథ్యంలో, చివరిదైన మూడో మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. మోర్గాన్ కెరీర్‌లో 13వ వనే్డ సెంచరీ సాధించి, 257 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ కేవలం 44.3 ఓవర్లలోనే ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు. జట్టుకు వనే్డ సిరీస్‌ను అందించాడు. అమీతుమీ తేల్చుకోవానికి జరిగిన పోరులో ఆచితూచి ఆడామని మోర్గాన్ ఒక ఇంటర్వ్యూలో అన్నాడు. మొదటి రెండు వనే్డల్లో తమ ఆటను విశే్లషించుకొని, లోపాలను సరిదిద్దుకొని, ముందంజ వేశామన్నాడు. జో రూట్‌తోకలిసి తాను నెలకొల్పిన 186 పరుగుల అజేయ భాగస్వామ్యం ఇంగ్లాండ్ విజయానికి బాటలు వేసిందన్నాడు. భారత్ వంటి బలమైన జట్టును ఓడించి, వనే్డ సిరీస్‌ను కైవసం చేసుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పాడు. టెస్టు సిరీస్‌లోనూ టీమిండియాకు ఇంగ్లాండ్ గట్టిపోటీనిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.