క్రీడాభూమి

హాంకాంగ్‌లో విజయంతో నాలో విశ్వాసం పెరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 19: హాంకాంగ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో విజయం సాధించడంతో తనలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని భారత టెన్నిస్ క్రీడాకారిణి కర్మన్ కౌర్ తండి ధీమా వ్యక్తం చేసింది. ఇదే ఆత్మవిశ్వాసం, ధైర్యంతో ఇండోనేషియాలో ఆగస్టు 18 నుంచి జరుగనున్న ఆసియా క్రీడల్లో మహిళల సింగిల్స్‌లో పాల్గొంటున్నట్లు ఈ 20 ఏళ్ల కర్మన్ కౌర్ తెలిపింది. ఐటీఎఫ్ ప్రో సర్క్యూట్‌లో ఢిల్లీకి చెందిన కర్మన్ కౌర్ తన తొలి సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. గత నెలలో జరిగిన 25,000 యూఎస్ డాలర్ హాంకాంగ్ టోర్నమెంట్ ఫైనల్లో ఆమె తన ప్రత్యర్థి టాప్ 200 ర్యాంకర్ జియా జింగ్ లూస్‌ను ఓడించింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో చక్కటి ఆటతీరును ప్రదర్శించి జియా జింగ్ లూస్‌పై గెలుపొందడం ఎంతో సంతోషంతో పాటు తనలో ధైర్యం రెట్టింపు అయిందని పీటీఐతో మాట్లాడుతూ కర్మన్ తెలిపింది. అయితే ఆసియా క్రీడల్లో మాత్రం ఇతర దేశాలకు చెందిన మేటి క్రీడాకారిణులతో తలపడటం కష్టమేనని, ఈసారి ఆసియా క్రీడల్లో టాప్ వందలో పది మంది తప్పకుండా పాల్గొంటున్నారని తెలిపింది. ఆసియా క్రీడల్లో మాత్రం ప్రత్యర్థుల నుండి గట్టి పోటీ ఎదురైనప్పటికీ ఎదుర్కొని దేశానికి పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. ఆసియా క్రీడల్లో సింగిల్స్‌లో పాల్గొంటున్న కర్మన్ పతకం సాధిస్తానని, ఈ టోర్నమెంట్‌లో టాప్ 100లో కనీసం పది మంది ఆసియా క్రీడాకారులు పోటీ పడుతున్నారని, ప్రస్తుతం సింగిల్స్‌లో 216 ర్యాంక్‌ను సాధించిన కర్మన్ తెలిపింది. గత కొన్ని వారాలపాటు తాను మంచి మ్యాచ్‌లను ఆడగలిగానని, రెండు టోర్నమెంట్‌లలో సెమీస్‌కు చేరుకున్న తాను ఒక టోర్నమెంట్‌లో విజేతగా నిలిచానని తెలిపింది. ఆరు నెలల తరువాత తన ఆటలో ఎంతో పురోగతిని సాధించినట్లు తెలిపింది. విరాట్ కోహ్లీ ఫౌండేషన్ సహకారంతో ఆడుతున్న కర్మన్ ఇపుడు తన మొదటి వరల్డ్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో శనివారం నుండి ప్రారంభమయ్యే 250కే టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లో పాల్గొననుంది. ఆ తరువాత ఆసియా క్రీడల కోసం సన్నాహాలు చేస్తోంది.