క్రీడాభూమి

విండీస్ బోర్డుకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: అనేకానేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి)కి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నుంచి కొంత ఊరట లభించింది. 2014లో భారత్ టూర్‌కు వచ్చిన విండీస్ జట్టు షెడ్యూల్ పూర్తికాక ముందు పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని స్వదేశానికి వెళ్లిపోయింది. ఆటగాళ్లు, డబ్ల్యుఐసిబి మధ్య పారితోషికం, సెంట్రల్ కాంట్రాక్టులోని అంశాలపై తలెత్తిన వివాదాలే ఈ పరిణామానికి కారణం. ఆటగాళ్లదే తప్పని విండీస్ క్రికెటర్లు, డబ్లుఐసిబి అధికారులు తమను వేధిస్తున్నారని, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే టూర్‌ను రద్దు చేసుకున్నామని క్రికెటర్లు పరస్పరం నిందించుకున్నారేగానీ ఇప్పటి వరకూ ఆ సమస్యకు తెరపడలేదు. ఇలావుంటే, టూర్‌ను విండీస్ క్రికెటర్లు హఠాత్తుగా రద్దు చేసుకొని స్వదేశానికి వెళ్లిపోవడాన్ని బిసిసిఐ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. విండీస్ బోర్డుకు 41.97 మిలియన్ డాలర్లు (సుమారు 280 కోట్ల రూపాయలు) జరిమానాగా విధించింది. ఈ మొత్తాన్ని చెల్లించాల్సిందేనని లేకపోతే ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను రద్దు చేసుకుంటామని హెచ్చరించింది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పరిహారం చెల్లించలేమని డబ్ల్యుఐసిబి పలుమార్లు విజ్ఞప్తి చేసినా బిసిసిఐ పట్టించుకోలేదు. పరిహారం చెల్లించాల్సిందేనని పట్టుబట్టింది. అప్పట్లో బిసిసిఐ అధ్యక్షుడిగా వ్యవహరించిన శ్రీనివాసన్‌గానీ, ఆతర్వాత అ పదవికి ఎన్నికైన జగ్మోహన్ దాల్మియాగానీ విండీస్ బోర్డుకు గతంలో జారీ చేసిన అల్టిమేటం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, ప్రస్తుత బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ చొరవచూపి, పరిహారం చెల్లింపు డిమాండ్‌ను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించాడు. ఈ విషయాన్ని అతను ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ప్రస్తుతం సమస్యకు తెరపడిందని, 2014లో అర్ధాంతంగా ఆగిపోయిన మిగతా మ్యాచ్‌లను విండీస్ 2017 టూర్‌లో ఆడుతుందని తెలిపాడు.