క్రీడాభూమి

భళా.. భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: బెంగళూరులో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత పురుషుల హాకీ జట్టు న్యూజిలాండ్‌పై రెండో ఘన విజయం నమోదు చేసింది. ట్రై సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టును పూర్తిగా కట్టడి చేసిన భారత్ 3-1 స్కోరు సాధించి 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ ఆరంభంలోనే భారత స్ట్రైకర్ ఎస్‌వి సునీల్ షాట్‌ను న్యూజిలాండ్ గోల్‌కీపర్ రిచర్డ్ జోయిస్ సమర్థంగా అడ్డుకోవడంతో మ్యాచ్ హోరాహోరీగా మారింది. ప్రథమార్థంలో రెండు జట్లూ గోల్స్ సాధించలేకపోవడంతో, ద్వితీయార్థం హోరాహోరీగా మ్యాచ్ సాగింది. అటాకింగ్ గేమ్‌కు దిగిన భారత్, న్యూజిలాండ్‌పై వత్తిడి పెంచి, 18వ నిమిషంలో గోల్ సాధించింది. రూపేందర్ పాల్ సింగ్ సాధించిన గోల్‌తో భారత్ 1-0 ఆధిక్యానికి చేరింది. రెండు నిమిషాలు తిరక్కుండానే స్ట్రైకర్ సునీల్‌కు మరో అవకాశం దక్కినా గోల్‌గా మలచడంలో విఫలమయ్యాడు. 24వ నిమిషంలో న్యూజిలాండ్ స్ట్రైకర్ స్టీఫెన్ జెనె్నస్ గోల్ సాధించి స్కోరును సమం చేశాడు. మరింత అటాకింగ్ గేమ్‌కు దిగిన భారత్ 27వ నిమిషంలో సిమ్రన్‌జీత్ సింగ్ పాసింగ్‌తో స్ట్రైకర్ సునీల్ గోల్ సాధించడంతో భారత్ 2-1 ఆధిక్యానికి చేరింది. థర్డ్ క్వార్టర్‌లో న్యూజిలాండ్ తన రక్షణ వలయాన్ని పటిష్టం చేసుకోవడంతో భారత్ స్ట్రైకర్ల గోల్ ప్రయత్నాలు ముందుకు సాగలేదు. చివరి క్వార్టర్ 56వ నిమిషంలో స్ట్రైకర్ సునీల్ అందించిన పాసింగ్‌ను మన్‌దీప్ సింగ్ గోల్‌గా మలచడంతో భారత్ 3-1తో ఆధిక్యానికి చేరింది. చివరి క్షణం వరకూ న్యూజిలాండ్‌ను భారత్ పూర్తిగా కట్టడి చేయడంతో మ్యాచ్‌తోపాటు సిరీస్ భారత్ పరమైంది.