క్రీడాభూమి

అడ్వాన్స్‌గా ప్లాన్ చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 23: విదేశీ టూర్లు తగిలినపుడు ముందుకు వెళ్లడం కేవలం క్రికెట్ కోసమే కాదని, ఆ దేశ పర్యాటకాన్ని సందర్శించి కల్చర్‌ని అర్థం చేసుకోవడం కూడా ఉంటుందని భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా అభిప్రాయపడ్డాడు. ‘విదేశీ టూర్లలో ఆ దేశాన్ని చూడొచ్చు. అక్కడి అందమైన ప్రదేశాలు తిలకించొచ్చు. అలా ఆ దేశంయొక్క కల్చర్‌ని అర్థం చేసుకోవచ్చు. ఆ ఆనందం మన సామర్థ్యంమీద కచ్చితంగా ప్రభావం చూపుతుందని భావిస్తా’ అంటున్నాడు బుమ్రా. ఇంగ్లాండ్‌తో జరగబోయే ఐదు టెస్ట్‌ల సీరీస్‌లో రెండు టెస్ట్‌నుంచి బుమ్రా అందుబాటులో ఉంటాడని సెలెక్టర్లు ప్రకటించడం తెలిసిందే. ‘నేను ఏదైనా కొత్త దేశానికి వెళ్లాల్సి వచ్చినపుడు కాస్త ముందుగానే ప్లాన్ చేసుకుంటా. ఈ దేశంలో అడుగుపెట్టకముందే, దానికి సంబంధించి కొన్ని వీడియోలను చూస్తా. సుదీర్ఘ టూర్‌కి వెళ్లేటపుడు ఆ దేశంయొక్క వాతావరణ పరిస్థితులు, పర్యాటక ప్రాంతాలను అర్థం చేసుకోవడం అత్యవసరం కూడా. ఈ ప్రిన్సిపుల్‌ని నేను కచ్చితంగా ఫాలో అవుతా’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు. లిమిటెడ్ ఓవర్ల క్రికెట్‌కు సంబంధించి భారత జట్టుకు బుమ్రా కీలకమైన బౌలర్. అంతేకాదు, దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌ల్లోనూ బుమ్రా అద్భుతమైన ప్రదర్శన (మూడు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు) ఇవ్వడం తెలిసిందే. ఇంగ్లాండ్ టూర్‌లో భాగంగా ఐర్లాండ్‌తో భారత్ ఆడిన టీ-20 సిరీస్‌లో బొటనవేలి గాయానికి గురైన బుమ్రా, ఇంగ్లాండ్‌తో టీ-20, వనే్డ సిరీస్‌కు అందుబాటులో లేడు. సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్‌లను గుర్తు చేసుకుంటూ ‘నాకు ఎక్కువ ఆసక్తినిచ్చేది టెస్ట్ మ్యాచ్‌లే. సౌతాఫ్రికాతో టెస్ట్‌లో ఆడటం చాలా సంతోషాన్నిచ్చింది. ఏ ఫార్మాట్ క్రికెట్ అయినా ఇష్టమే. కాకపోతే, టెస్ట్ మ్యాచ్‌లంటే పడిచస్తా. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్‌ల్లో ప్రతీ బంతీ మనకు పరీక్షే’నని వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో తన వంతు పాత్ర పోషిస్తానని చెబుతూ ‘జట్టు విజయానికి సమర్థ పాత్ర పోషించాలన్న ఆశాభావంతో ఉన్నా. ఎక్కువ ఆడితే నా ఆటపై నాకు నమ్మకం పెరుగుతుంది కూడా. ఇది ఇతర ఫార్మాట్ల క్రికెట్‌పైనా ప్రభావం చూపుతుందనే అనుకుంటున్నా’ అని వ్యాఖ్యానించాడు.