క్రీడాభూమి

క్రీడల అభివృద్ధికి చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 26: దేశంలో క్రీడల అభివృద్ధికి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ విజ్ఞప్తి చేశాడు. కానె్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) గ్లోబల్ స్పోర్ట్స్ సమ్మిట్ స్కోర్ కార్డ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 8 నుంచి 10 ఏళ్ల వయసు మధ్యగల బాలల్లో నైపుణ్యాలను, క్రీడాపటిమను గుర్తించి, వారికి స్కాలర్‌షిప్పులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్టును ప్రారంభించేందుకు యోచిస్తున్న విషయాన్ని వెల్లడించాడు. పాఠశాలల బోర్డులు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, సాయుధ దళాలతో తాము భాగస్వాములం కావడం ద్వారా శారీరక సామర్ధ్యం కలిగిన 8 నుంచి 10 ఏళ్ల మధ్య వయసు గల విద్యార్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నాడు. తొలుత 5వేల మందిని ఎంపిక చేస్తామని, వారికి మరిన్ని పరీక్షలు నిర్వహించి వెయ్యిమందిని తీసుకునే అవకాశం ఉందని తెలిపాడు. తుది జాబితాకు ఎంపికైన విద్యార్థులకు ఎనిమిదేళ్ల వరకు అంటే వారికి 16 సంవత్సరాల వయసు వచ్చేవరకు ఐదు లక్షల రూపాయల స్కాలర్‌షిప్ అందజేయడం ద్వారా భవిష్యత్తులో మంచి చాంపియన్‌గా రాణించేలా తీర్చిదిద్దుతామని పేర్కొన్నాడు. క్రీడల్లో పెట్టుబడులకు ఇదే మంచి తరుణమని అంటూ 1990 నుంచి నేటివరకు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఎంతోమందికి నేషనల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎన్‌ఎస్‌డీఎఫ్) నిధులు సమకూర్చిన విషయాన్ని గుర్తు చేశాడు.
ఇందుకు పబ్లిక్ సెక్టార్ యూనిట్ల నుండి పెద్దఎత్తున నిధుల రూపంలో అందాయని, కనుక ఇపుడు కూడా దేశంలో క్రీడారంగాన్ని మరింత ప్రగతిపథంలో తీసుకెళ్లేందుకు వీలుగా పెట్టుబడులకు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చాడు.