క్రీడాభూమి

సౌరభ్‌తో మిథున్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్లాదివోస్టాక్ (రష్యా), జూలై 27: రష్యా ఓపెన్ బీడబ్ల్యుఎఫ్ టూర్ సూపర్ 100 టోర్నమెంట్‌లో భారత షట్లర్లు దూసుకుపోతున్నారు. పురుషుల సింగిల్స్ విభాగంలో సౌరభ్ వర్మ, మిథున్ మంజునాథ్‌లు సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. గాయాలనుంచి కోలుకుని ఇటీవలే ఆసియా గేమ్స్‌కు క్వాలిఫై అయిన 8వ సీడ్ సౌరభ్ వర్మ శుక్రవారం క్వార్టర్ ఫైనల్స్‌లో ఇజ్రాయిల్ థర్డ్ సీడ్ మిషా జిల్బెర్మన్‌ను 36 నిమిషాల్లో 21-14, 21-16 సెట్లతో మట్టికరిపించాడు. మరో క్వార్టర్ ఫైనల్‌లో భారత షట్లర్ మిథున్ మలేషియాకు చెందిన సతీష్‌థరన్ రామచంద్రన్‌పై 21-18, 21-12స్కోరుతో విజయం సాధించాడు. దీంతో ఇద్దరు భాతర ఆటగాళ్లు సెమీఫైనల్స్‌లో పోటీ పడబోతున్నారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో రెండో సీడ్ రోహన్ కఫూర్, కుహూ గార్గ్‌లు సెమీఫైనల్‌కు చేరుకున్నారు. రష్యాకు చెందిన ఆండ్రెజ్ లోగినోవ్, లిల్లీయా అబీబులెవాతో కూడిన ప్రత్యర్థి జట్టుపై 21-13, 21-9 స్కోరుతో కుహూ-రోహన్ విజయం సాధించారు. ఇదిలావుంటే మరో క్వార్టర్ ఫైనల్‌లో మలేసియా జట్టు 21-15, 21-8 తేడాతో సౌరబ్ శర్మ, అనౌష్క పరీక్‌లతో కూడిన భారత జట్టును మట్టి కరిపించి సెమీస్‌కు చేరుకుంది. ఇదిలావుంటే సింగిల్స్ పోరులో మాజీ జాతీయ చాంప్ రితుపర్న దాస్ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. యుఎస్‌ఏకు చెందిన ఐరిస్ వాంగ్‌పై 21-17, 21-13 తేడాతో రితుపర్న దాస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మలేసియాకు చెందిన యెన్ మీ హోపై 9-21, 11-21తో ఓడిన వృషాలి గుమ్మాడి సైతం టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. రష్యాకు చెందిన సెకెండ్ సీడ్ వ్లాదిమిర్ మాల్కోవ్‌పై 48 నిమిషాల పోరాటం సాగించిన భారత్ ఐదో సీడ్ శుభాంకర్ డే చివరకు 20-22, 15-21తో టోర్నీ నుంచి నిష్క్రమించాడు.