క్రీడాభూమి

జూ.ఎన్బీఏలో భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: జూనియర్ ఎన్‌బిఏ ప్రపంచ చాంపియన్‌షిప్ టోర్నీకి భారత్ నుంచి 20మంది బాలబాలికలు ప్రాతినిథ్యం వహించబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 13, 14 ఏళ్ల పిల్లలతో ఎన్‌బిఏ గ్లోబల్ యూత్ బాస్కెట్‌బాల్ టోర్నీ నిర్వహించడం ఇదే ప్రథమం. జూనియర్ ఎన్‌బిఏ వరల్డ్ చాంపియన్‌షిప్ టోర్నీలో పోటీ పడనున్న వివిధ దేశాలకు చెందిన 32 జట్లను ఇప్పటికే ఎన్‌బిఏ ప్రకటించింది కూడా. ఓర్లాండోకు సమీపంలోని వాల్ట్ డిస్నీ వరల్డ్ రిసార్ట్‌లోని ఈఎస్‌పిఎన్ వరల్డ్ ఆఫ్ స్పోర్ట్ కాంప్లెక్స్‌లో ఆగస్టు 7నుంచి 12 వరకూ ఈ టోర్నీ జరగబోతోంది. న్యూఢిల్లీకి చెందిన బాలుర జట్టు, బెంగళూరుకు చెందిన బాలికల జట్టు టోర్నీకి హాజరవుతున్నాయి. షెహజ్‌బీర్ సింగ్ బేడి, భవిక్ గార్గ్, జీవాన్షు కత్రి, నిఖిల్ కుమార్, దినేష్ పాల్, యతిష్ షకుజ, అభిషేక్ సింగ్, అర్పిత్ సిగ్ల, లైవిష్ వాట్స్, సచిన్ యాదవ్‌లతో కూడిన బాలుర జట్టుకు ప్రధాన కోచ్‌గా సిద్ధార్ధ్ దలాల్, సహాయక కోచ్‌గా దెవోజ్యోతి కర్మాకర్‌లు వ్యవహరిస్తారు. వేదా ఆనంద్, శ్రేయ అశోక్, నుహ ఆసిఫ్ మసూద్, శ్రేయ బోస్, సునిష్క కార్తీక్, దివ్య కోఠారి, మేఘనా మంజునాథ, వౌమిత మిశ్రా, హంసా నంజుందియా, వేముల స్మృతితో కూడిన బాలకల జట్టుకు ప్రధాన కోచ్‌గా ప్రసన్న వెంకటేష్, సహాయక కోచ్‌గా సోనాల్ నంబియార్ వ్యవహరిస్తారు. 35 దేశాల నుంచి టోర్నీకి హాజరవుతున్న 317మంది బాలబాలికల జట్లను మూడుసార్లు ఎన్‌బిఏ చాంపియన్, జూనియర్ ఎన్‌బిఏ ప్రపంచ చాంపియన్‌షిప్ గ్లోబల్ అంబాసిడర్ ద్వ్యానే వాడె, 2018 ఎన్‌బిఏ ఆల్ స్టార్ ఆండ్రే డ్రుమోండ్, 8సార్లు ఎన్‌బిఏ ఆల్ స్టార్ విన్స్ కార్టర్, మిల్వాయుకె బక్స్ సెంటర్ బ్రూక్ లోపెజ్, 2018 నైస్మిత్ మెమోరియల్ బాస్కెట్‌బాల్ హాల్ ఆఫ్ ఫేమ్ గ్రాంట్ హిల్‌లాంటి దిగ్గజాలు కలుస్తారు. ఈ ఏడాది ఆరంభంలో నిర్వహించిన రీజినల్‌స్థాయి పోటీల్లో ఎంపికైన 32 జట్లు (16 యూఎస్ జట్లు, 16 అంతర్జాతీయ జట్లు) ప్రపంచ చాంపియన్‌షిప్ టోర్నీలో తలపడతాయి. 16 అంతర్జాతీయ జట్లు (8 బాలురు, 8 బాలికలు) ఆఫ్రియా, మధ్య ఆసియా, ఆసియా ఫసిఫిక్, కెనడా, చైనా, యూరోప్, భారత్, మెక్సికో, దక్షిణ ఆమెరికా ప్రాంతాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. రౌండ్ రాబిన్, సింగిల్ ఎలిమినేషన్ విధానంలో పోటీలు సాగుతాయి. ఫైనల్‌కు చేరిన యూఎస్ మరియు అంతర్జాతీయ జట్లు ఆగస్టు 12న ప్రపంచ చాంపియన్‌షిప్ టోర్నీలో తలపడతాయి.