క్రీడాభూమి

కింకర్తవ్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్లెమ్స్‌ఫోర్డ్, జూలై 27: కౌంటీ చాంపియన్ ఎసెక్స్‌ను మార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఎదుర్కొన్న తీరు చూస్తే కోహ్లీటీంపై సందేహాలు ముసురుతున్నాయి. ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ కైవసం చేసుకోవడం సారథి కోహ్లీకైనా సాధ్యమేనా? అన్న సందిగ్దం తలెత్తుతోంది. కౌంటీ జట్టుపై ప్రాక్టీస్ మ్యాచ్‌ను మమ అనిపించడం తప్ప టీమిండియా మెరిపించిన మెరుపులేవీ లేవు. ఈ పరిస్థితుల్లో మోర్గాన్ జట్టును దెబ్బతీయాలంటే మరింత ప్రాక్టీస్ తప్పని సరి అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చెమ్స్‌ఫోర్డ్‌లో మొదలైన తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 396 పరుగులు సాధిస్తే, ఎసెక్స్ 359/8 సాధించి డిక్లేర్ చేసింది. శుక్రవారం మలి ఇన్నింగ్స్ మొదలెట్టిన టీమిండియా 89/2 సాధించింది. గత రెండు నెలలుగా వానజాడ లేని మైదానంపై అకస్మాత్తుగా వర్షం కురియడంతో మ్యాచ్‌ను నిలిపివేసి డ్రాగా ప్రకటించారు. కీలక వికెట్లు తీసి ఉమేష్ యాదవ్ ఓకే అనిపించుకుంటే, ఓపెనర్‌గా ఆశలుపెట్టుకున్న శిఖర్ ధావన్ పేలవమైన ప్రదర్శన ఇచ్చాడు. రెండు ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా నిలవడం టీమిండియాను కలవరపెట్టే అంశమే. మోర్గాన్ జట్టును ఎదుర్కోవాలంటే టీమిండియాకు కొత్త ప్రణాళికలే కాదు, అకుంఠిత సాధన కూడా అవసరం అనడంలో సందేహం లేదు.