క్రీడాభూమి

ఫైనల్‌కు నీరజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జురిచ్: జావెలిన్ త్రో భారత స్టార్ ఆటగాడు నీరజ్ చోప్రా ప్రపంచ ప్రఖ్యాత డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సపాదించాడు. జురిచ్‌లో ఆగస్టు 30న జరగనున్న ఫైనల్స్‌కు నీరజ్‌తోపాటు ప్రపంచ చాంపియన్ జోహెన్నస్ వెట్టర్, ఒలింపిక్ చాంపియన్లు థామస్ రోహ్లర్, ఆండ్రియాస్ హఫ్‌మన్, ఎస్టోనియన్, రికార్డు హోల్డర్ మాగ్నస్ కిర్ట్‌లు అర్హత సాధించారు. కామనె్వల్త్ చాంపియన్ నీరజ్ గత నెల రెబాట్ (మొరాకో)లో జరిగిన ఐదో మీట్‌లో 83.32 మీటర్లు త్రో చేసి నాలుగు పాయింట్లు సంపాదించడం తెలిసిందే. రెబాట్‌కు ముందు రెండు డైమండ్ లీగ్ మీట్‌లలో (మే 4నుంచి 6 వరకూ దోహాలో జరిగిన 4వ మీట్‌లో ఐదు పాయింట్లు, మే 25న ఉజీన్ (యుఎస్)లో జరిగిన మీట్‌లో 3 పాయింట్లు) ఎనిమిది పాయింట్లతో మొత్తంగా ఫైనల్‌కు అర్హత సంపాదించాడు. దోహా డైమండ్ మీట్‌లో అద్వితీయ ప్రతిభ కనబర్చిన 20 ఏళ్ల నీరజ్ 87.43 మీటర్ల దూరం జావెలిన్ విసిరి సంచలనం సృష్టించటం తెలిసిందే. ప్రఖ్యాత డైమండ్ లీగ్‌లో చోటుకోసం ప్రపంచవ్యాప్త అథ్లెట్లు పరితపిస్తారు. ఎందుకంటే 14 దశలకు సంబంధించి ప్రతీ దశలోనూ 8వ స్థానం ఆటగాడికి 1000, విన్నర్‌కు 10,000 అమెరికన్ డాలర్ల ప్రైజ్ మనీ ఉంటుంది. అలాగే జురిచ్, బ్రెస్సెల్స్‌లో జరిగే చివరి రెండు మీట్‌లలో 8వ స్థానం అథ్లెట్‌కు 2,000, విన్నర్‌కు 50,000 అమెరికన్ డాలర్ల ప్రైజ్‌మనీ అందుతుంది.