క్రీడాభూమి

38 బంతులు 102 పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 28: న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గుఫ్తిల్ మెరుపులు మెరిపించాడు. 38 బంతుల్లో 102 పరుగులు సాధించి టీ-20ల్లో వేగవంతమైన సెంచరీలు సాధించిన స్ట్రయికర్ల జాబితాలోకి చేరిపోయాడు. వర్సెస్టర్‌షైర్, నార్తంప్టన్‌షైర్ జట్ల మధ్య శనివారం జరిగిన టీ-20 కౌంటీ మ్యాచ్‌లో గుఫ్తిల్ ఈ ఘనత సాధించాడు. వర్సెస్టర్‌షైర్ తరఫున 33 బంతుల్లో 61 పరుగులు సాధించిన జోయ్ క్లార్క్‌తో కలిసి గుఫ్తిల్ 10 ఓవర్లలో 162 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించాడు. 12 ఫోర్లు, 7 సిక్సర్లతో చెలరేగిపోయిన గుఫ్తిల్‌ను నియంత్రించడం నార్తంప్టన్‌షైర్ బౌలర్లవల్ల కాలేదు. రిచర్డ్ గ్లీసన్, రోరీ క్లీన్‌వెల్డ్ నుంచి ఒక్కో ఓవర్‌లో 22 చొప్పున 44 పరుగులు సాధించిన గుఫ్తిల్, తొలి 20 బంతుల్లోనే అర్థసెంచరీ చేశాడు. గ్రరుూమ్ వైట్, సీకుజ్ ప్రసన్న ఓవర్లతో 90 పరుగులకు చేరుకున్న గుఫ్తిల్, కిలె కోయిట్జెర్ ఓవర్‌లో బౌండరీ, సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేశాడు. తరువాత గ్లీసన్ మిడ్ ఆన్ ఓవర్‌లో జోష్‌కాబ్‌కు క్యాచ్ ఇచ్చి గుఫ్తిల్ ఔటైనా, అప్పటికే మ్యాచ్ వర్సెస్టర్‌షైర్ పరమైంది.