క్రీడాభూమి

భళా.. నీరజ్, హిమదాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 28: చెక్ రిపబ్లిక్‌లోని ఓస్ట్రావాలో జరగనున్న ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కాంటినెంటల్ కప్ పోటీలకు భారత సంచలనాలు నీరజ్ చోప్రా, హిమదాస్ సహా మరో ఐదుగురు ఎంపికయ్యారు. ఓస్ట్రావాలో సెప్టెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న ఈవెంట్‌లో ఆసియా- ఫసిఫిక్ టీం తరఫున ఏడుగురు అథ్లెట్లను ఆసియా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఎంపిక చేసింది. ఈ సీజన్‌లో రీజినల్ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అథ్లెట్లను ప్రస్తుత ఐఏఏఎఫ్ ప్రపంచ ర్యాంకుల ఆధారంగా వీరిని ఎంపిక చేశారు. ఆసియా -్ఫసిఫిక్ బృందం పురుషుల విభాగంలో నీరజ్ చోప్రా (జావెలిన్), మహమ్మూద్ అనాస్ (400 మీ), జిన్సన్ జాన్సన్ (800మీ), అర్పిందర్ సింగ్ (ట్రిపుల్ జంప్)లు ఉన్నారు. మహిళల విభాగంలో హిమదాస్ (400మీ), పియు చిత్ర (1500మీ), సుధా సింగ్ (3000మీ స్టీప్‌లీచెస్)లు ఉన్నారు. అయతే, ఈ సీజన్‌లో ప్రస్తుతం ఎంపికైన అథ్లెట్ల ప్రదర్శనకు మించి మరెవరైనా రికార్డులు సృష్టిస్తే, వీరిస్థానంలో వారిని ఎంపిక చేస్తారు. నీరజ్ చోప్రా ప్రస్తుతం ఫిన్‌లాండ్‌లో జర్మనీ జాతీయ కోచ్ ఉవె హోన్ వద్ద శిక్షణ పొందుతున్నాడు. అనాస్, హిమదాస్‌లు వచ్చే ఆసియా గేమ్స్ కోసం చెక్ రిపబ్లిక్‌లో శిక్షణ పొందుతుంటే, మిగిలిన అథ్లెట్లు గలినా బుఖారినాలో ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు.