క్రీడాభూమి

కోహ్లీకి జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, ఏప్రిల్ 23: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీపై 12 లక్షల రూపాయల జరిమానా వేటు పడింది. రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో గెలిచిన బెంగళూరు నిర్ణీత సమయంలో ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయింది. స్లో ఓవర్‌రేట్‌కు కోహ్లీని బాధ్యడ్ని చేస్తూ జరిమానా విధించామని ఐపిఎల్ కమిటీ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఆ మ్యాచ్‌లో ఎబి డివిలియర్స్ 46 బంతుల్లో 83, కోహ్లీ 63 బంతుల్లో 80 పరుగులు చేసి, బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కాగా, విరాట్ కోహ్లీ శుక్రవారం నాటి మ్యాచ్‌కి ముందు రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో మొత్తం 83 బంతులు ఎదుర్కొని 115 పరుగులు సాధించాడు. ఐపిఎల్‌లో ఒక బౌలర్‌పై వందకుపైగా పరుగులు సాధించి, ఒక్కసారి కూడా అతని బౌలింగ్‌లో అవుట్‌కాకుండా నిలిచిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు.