క్రీడాభూమి

చారిత్రక వెయ్యో టెస్ట్ కైవశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్‌హామ్, ఆగస్టు 4: చివరి వరకూ ఊరించిన విజయం చివరి క్షణంలో ఉసూరుమనిపించడంతో గుండెలవిసే బాధలో టీమిండియా మునిగిపోయింది. విరాట్ కోహ్లీ శతక పంతాన్ని ఛేదించి తొలి టెస్ట్‌లో ఇంగ్లీషోళ్లే గెలుపు తలుపుతట్టారు. సొంత గడ్డపై టెస్ట్ గుత్త్థాపత్యాన్ని నిలుపుకునే ప్రయత్నంలో ‘తొలి’ అడుగువేశారు. వెయ్యో టెస్ట్‌లో విజయం, అదీ భారత్‌పై వాళ్లకెప్పటికీ ఆనందమే. నిజానికి భారత్ విజయం 31 పరుగుల దూరంలో ఆగిపోయింది. టాప్ ఆర్డర్ విఫలంతో రెండో ఇన్నింగ్స్ బాధ్యతనూ బ్యాట్టుకెత్తుకున్న విరాట్‌కు బెన్ స్టోక్స్ అడ్డుపడటంతో ఇంగ్లీష్ జట్టువైపే ఇన్నింగ్స్ టర్నయ్యింది. దీంతో మొత్తం మ్యాచ్‌లో కోహ్లీ పరాక్రమం మురిపించిందే తప్ప ముచ్చట తీర్చలేదు. ఐదు వికెట్ల నష్టానికి 110 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగోరోజు ఆటకు దిగిన భారత్ ఆదిలోనే తడబడింది. తొలి ఓవర్ చివరి బంతికే దినేష్ కార్తీక్ (20) స్లిప్‌లోని ఆండర్సన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. క్రీజ్‌లోకి వచ్చి దూకుడుగా ఆడిన పాండ్యా (29), ఊరించిన బ్రాడ్ బంతికి దొరికిపోయాడు. అప్పటికి 88 బంతుల్లో 17వ టెస్ట్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు కోహ్లీ. 47వ ఓవర్‌లో బెన్ స్టోక్స్ (4-40) ట్రాప్‌కు చిక్కి ఎల్‌బిడబ్ల్యు కావడంతో కోహ్లీ (51: 97 బంతుల్లో) పెవిలియన్‌కు చేరాడు. చిట్టచివరి ఆశాకిరణమైన షమి (0) సైతం అదే ఓవర్ చివరి బంతితో వెనుతిరిగాడు. దూకుడు ఆటకు దిగిన ఇషాంత్ శర్మ (11)ను ఔట్ చేసేందుకు ఆదిల్ రషీద్ (1-9)ను దింపి ఇంగ్లాండ్ సక్సెస్ అయ్యింది. ఇన్నింగ్స్ నిలబెట్టే బాధ్యతతో పరుగులు మొదలెట్టిన పాండ్యా వికెట్‌కు బెన్‌స్టోక్స్ చెక్ పెట్టడంతో భారత్ ఆట ముగిసిపోయింది. విజయానికి 31 పరుగుల దూరంలో 54.2 ఓవర్లలో 162 పరుగుల వద్ద టీమిండియా ఆలౌటైంది. ఒక్క రోజులో నాలుగు వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ను బెన్‌స్టోక్స్ వెన్ను విరిచేస్తే, జేమ్స్ ఆండర్సన్ (2-50), స్టార్ట్ బ్రాడ్ (2-43) అతనికి పూర్తిగా సహకరించారు. గెలుపు కోసం టీమిండియా బౌలర్లు శక్తికొద్దీ శ్రమించినా, కోహ్లీవినా బ్యాట్సమెన్ల వైఫల్యం గెలుపునకు దూరం చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో రూట్ చేసిన 80 పరుగుల స్కోరు ఇంగ్లాండ్‌ను 287కు చేరిస్తే, మలిరోజు కోహ్లీ సాధించిన 22వ టెస్ట్ సెంచరీ భారత్ ఇన్నింగ్స్‌ను నిలిపింది. మూడోరోజు ఇషాంత్ తీసిన ఐదు వికెట్లు ఇంగ్లాండ్ స్కోరును 180కే పరిమితం చేస్తే, నాలుగో రోజు బెన్‌స్టోక్స్ తీసిన నాలుగు కీలక వికెట్లు భారత వెన్ను విరిచి ఇంగ్లాండ్‌ను విజేతగా నిలిపింది.