క్రీడాభూమి

చెలరేగిన సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాన్జింగ్ (చైనా): సుదీర్ఘ ర్యాలీలు.. చక్కని ప్లేస్‌మెంట్లు.. వ్యూహాత్మక మైండ్‌గేమ్. సెమీఫైనల్స్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు చెలరేగిపోయింది. క్వార్టర్స్‌లో నిజోమి ఒకుహరను మట్టికరిపించి పతకం ఖాయం చేసుకున్న సింధు, సెమీస్‌లో యమగుచిని ఓడించి స్వర్ణానికి ‘ఫైనల్’ దూరంలో నిలిచింది. తుది పోరులో చిరకాల స్పెయిన్ ప్రత్యర్థి కరోలినా మారిన్‌ను ఎదుర్కోబోతోంది. గెలిస్తే.. చిరకాల స్వప్నం సాకారమే. ప్రఖ్యాత ప్రపంచ టోర్నీలో భారత్‌కు స్వర్ణ పతకమే. ఒలింపిక్ రజిత పతక విజేత సింధు అప్రతిహత విజయాలను కొనసాగిస్తోంది. ప్రపంచ చాంపియన్‌షిప్ టోర్నీలో శనివారం సెమీఫైనల్స్‌లో జపాన్ సీడ్ అకనె యమగుచికి చెమటలు పట్టించింది. 55 నిమిషాలపాటు సాగిన హోరాహోరీ పోరులో ప్రపంచ నెంబర్ 2 ఆధిక్యాన్ని తుత్తునియలు చేస్తూ 21-16, 24-22 సెట్లతో ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఈ ఏడాది ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్, గతేడాది దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్‌లో తన ఓటమికి కారణమైన యమగుచిపై ప్రతీకారం తీర్చుకోడానికి సింధు ప్రదర్శించిన పరాక్రమం అబ్బురపర్చింది. ‘యమగుచి అద్భుతమైన ఫాంలోవున్న షట్లర్. ఆమె ఆట తీరు నాకు పరిచయమే. అందుకే సెకండ్ సెట్‌లో ముందు తడబడినా ఆమె ఆధిక్యాన్ని అడ్డుకుంటూ ముందుకు రావడం సంతోషంగా ఉంది’ అంటూ సింధు ఆనందం వ్యక్తం చేసింది. సెమీస్‌లో అద్వితీయ విజయం కైవసం చేసుకున్న సింధు ఫైనల్‌లో ఒలింపిక్ చాంపియన్, రెండు స్వర్ణాలు సాధించిన స్పెయిన్ సీడ్ కరోలినా మారిన్‌ను ఎదుర్కోబోతోంది. రియో ఒలింపిక్‌లో స్వర్ణానికి దూరం చేసిన ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో సింధు కనిపిస్తోంది. గత జూన్‌లో మలేసియా ఓపెన్‌లో సైతం కరోలినా చేతిలో ఓటమితోనే సింధు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ‘తాజా గెలుపు సంతృప్తినిచ్చేదే. ఈసారి ఫైనల్‌లో గతంకంటే మెరుగైన ఫలితం సాధిస్తానన్న నమ్మకం ఉంది. ఆదివారంనాటి మ్యాచ్ ఒకింత అగ్రెసివ్‌గానే ఉండొచ్చు. ఫైనల్ మ్యాచ్‌లో మరింత అద్భుత ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా’ అంటూ మ్యాచ్ అనంతరం సింధు చేసిన వ్యాఖ్యల్లో అంతరార్థం అదే. శనివారం జరిగిన మరో సెమీ ఫైనల్‌లో చైనీస్ 8వ సీడ్ హి బింగ్జియోను 13-21, 21-16, 21-13 సెట్లతో మట్టి కరిపించి ప్రపంచ మాజీ చాంప్ కరోలినా మారిన్ ఫైనల్‌కు చేరుకుంది. సింధుతో తుది పోరుకు సిద్ధమవుతున్న స్పెయిన్ ప్రత్యర్థి కరోలినాను తక్కువ అంచనా వేయలేం. వేగం ఆమె ఆయుధం. ఆటలో తెంపరితనం ఆమె ఆత్మస్థయిర్యం. నేటి ఫైనల్స్‌లో సింధు ఎదుర్కోవాల్సింది ఈ రెంటినే.