క్రీడాభూమి

చేజారిన పసిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాన్జింగ్ (చైనా), ఆగస్టు 5: భారత్ ఆశలు నీరుగారాయి. ఈసారి ఖాయమనుకున్న స్వర్ణం మరోసారి చేజారింది. ప్రపంచ కప్ బాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు ఓడిపోయింది. గత 2016 రియో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకానికి దగ్గరైన సింధును అడ్డుకున్న మారినే మరోసారి భారత్ ఆశలకు చెక్ పెట్టింది. నాన్జింగ్‌లో ఆదివారం జరిగిన ఫైనల్స్ పోరులో ఒలింపిక్ చాంప్, స్పెయిన్ సీడ్ కరోలినా మారిన్ వేగంముందు సింధు తలొంచక తప్పలేదు. ఆఖరి పోరాటంలో ఓటమి చవిచూసిన సింధు, ఒలింపిక్ తరువాత మరోసారి రజత పతకంతో సరిపెట్టుకుంది. హోరాహోరీ పోరులో మారిన్‌పై పైచేయి కోసం సింధు గట్టిగానే ప్రయత్నించింది. తొలి సెట్ (19-21)లో గట్టి పోటీనిచ్చిన సింధు రెండో సెట్ (10-21)లో మారిన్ ఆట తెంపరితనం ముందు చేతులెత్తేయక తప్పలేదు. ‘రియో ఒలింపిక్స్‌లోనూ మారిన్‌తో ఫైనల్ ఆడాను. ఆమె గెలిచింది. ఇప్పుడు కాస్త గట్టి ప్రాక్టీస్‌తోనే వచ్చాను. కానీ, ఆమె వేగం ముందు నిలవడం కష్టమైంది. మారిన్ అగ్రెసివ్ షట్లర్. నిజానికి ఆమె పేస్ గేమ్‌ను ఫేస్ చేయడానికి ప్రిపేరై వచ్చాను. కానీ, ఫలితానికి దూరంగానే ఉండిపోయా. మరో టోర్నీపై ఇప్పటినుంచే దృష్టి పెడతాను’ అని మ్యాచ్ అనంతరం సింధు వ్యాఖ్యానించింది. ఈ సీజన్‌లో మూడు టోర్నీల ఫైనల్ సెషన్స్‌లో విఫలమైన సింధుకు నాల్గవసారీ పరాజయం తప్పలేదు. ఇక 2016 నుంచీ చూస్తే రియో ఒలింపిక్స్, హాంకాంగ్ ఓపెన్ (2017, 18), సూపర్ సిరీస్ ఫైనల్ (2017), ఇండియా ఓపెన్ (2018), థాయ్‌లాండ్ ఓపెన్ (2018)లాంటి ప్రఖ్యాత టోర్నమెంట్లలో సింధు వైఫల్యం ఇది ఎనిమిదోసారి. గతేడాది గ్లాస్గోలో జపాన్ సీడ్ నోజోమి ఒకుహర చేతిలో ఓడి ఈ టోర్నీలో ప్రతీకారం తీర్చుకున్న 23 ఏళ్ల స్టార్ షట్లర్, 45 నిమిషాల మ్యాచ్‌లో మారిన్‌ను ఎదుర్కోలేకపోవడం గురించి పెదవి విప్పలేదు. ఈ టోర్నీతో రెండు రజత పతకాలు సాధించిన సింధు, నాలుగు ప్రపంచ చాంపియన్‌షిప్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరిన భారత షట్లర్‌గా రికార్డు నిలుపుకుంది. 2013 గాంగ్జు, 2014 కొపెన్‌హగన్ టోర్నీలో సింధు కాంస్య పతకాలు గెలుచుకోవడం తెలిసిందే. ఇక మూడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లు సాధించిన తొట్ట తొలి మహిళగా టోర్నీ విజేత మారిన్ నిలిచింది. 2014, 2015 జకర్తా టోర్నీల్లోనూ ఆమె టైటిల్స్ సాధించింది.

చిత్రం..వరల్డ్ కప్ బాడ్మింటన్ మహిళా విజేతలు వరుసగా పీవీ సింధు (రజతం), కరోలినా మారిన్ (స్వర్ణం), హి బెంగ్జియో (కాంస్యం), అకానె యమగుచి (కాంస్యం)