క్రీడాభూమి

రెండో టెస్ట్‌కు స్టోక్స్ డౌటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్‌హామ్, ఆగస్టు 5: ఇంగ్లాండ్ చారిత్రక వెయ్యో టెస్ట్‌లో గెలుపు గుర్రమై నిలిచిన బెన్ స్టోక్స్ రెండో టెస్ట్‌లో ఉండకపోవచ్చు. అభిమానులకు షాకింగ్ న్యూసే అయినా, వ్యక్తిగత కేసు కారణంగా స్టోక్స్ ఆడకపోవచ్చని అంటున్నారు. భారత్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్ ఆడనున్న రెండో టెస్ట్ లాడ్స్‌లో ఆగస్టు 9నుంచి మొదలవుతుంది. ఇంగ్లీష్ జట్టులో తాజా కౌంటీవీరుడు ఓలివర్ పోప్, పేసర్ క్రిస్ వోక్స్‌కు స్థానందక్కే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత జట్టులోని డేవిడ్ మలన్‌ను తప్పించి, తాజా వేసవి కౌంటీల్లో అద్భుత ప్రదర్శన ఇచ్చిన 20ఏళ్ల కుర్ర ఆటగాడు ఓలివర్ పోప్‌కు జట్టులో స్థానం కల్పించనున్నారు. తొలి టెస్ట్‌లో ఏడు వికెట్లు తీసుకున్న భారత్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఎదుర్కోవాలంటే కుడిచేతివాటం కుర్ర బ్యాట్స్‌మెన్ అవసరమని ఇంగ్లాండ్ భావిస్తోంది. ‘ఓల్లీ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంపిక కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు అతను సరిగ్గా సరిపోతాడు’ అని ఇంగ్లాండ్ నేషనల్ సెలెక్టర్ ఎడ్ స్మిత్ వ్యాఖ్యానించాడు. అలాగే ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ స్థానంలో వోక్స్‌కు చోటుదక్కొచ్చు. ఓ గొడవకు సంబంధించి బ్రిస్టల్ క్రౌన్ కోర్టులో సోమవారం నుంచి మొదలవుతున్న విచారణకు స్టోక్స్ హాజరుకావాల్సి ఉంది. విచారణ వాయిదాపడితే మాత్రమే జట్టులో స్టోక్స్ కొనసాగుతాడు. తొలి టెస్ట్‌లో స్టోక్స్ ఫాం చూసిన తరువాత, అతనులేని మలి టెస్ట్ ఇంగ్లీష్ జట్టును ఊహించడం కొంచెం కష్టమేమరి.