క్రీడాభూమి

పెరిగిన ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బ్రాండ్ వాల్యూ అమాంతం 19 శాతం పెరిగింది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌తో ముంబయి ఇండియన్ (ఎంఐ) 113.0 మిలియన్ డాలర్ల బ్రాండ్ వాల్యూతో అగ్రస్థానంలో నిలబడింది. ఐపీఎల్ బ్రాండ్ విలువ పెరగడంలో ముంబయి ఇండియన్స్ వరుసగా అగ్రస్థానానికి చేరడం వరుసగా ఇది మూడోసారి. మూడుసార్లు ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ గెలవడంతో ఆ జట్టు బ్రాండ్ విలువ 19 శాతం పెరిగింది. ఐపీఎల్‌కు చెందిన డఫ్ అండ్ ఫెల్ప్స్ ఐదో ఎడిషన్ వార్షిక నివేదిక అధ్యయనం ప్రకారం 2017లో 5.3 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఐపీఎల్ బ్రాండ్ విలువ 2018లో 6.3 బిలియన్ డాలర్లు అయింది. ప్రసార హక్కుల ఫీజులను పెంచడం ద్వారా వార్షిక వృద్ధి రేటు 18.9 శాతం పెరిగింది. ముంబయి ఇండియన్స్ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) బ్రాండ్ విలువ 104.0 మిలియన్ డాలర్లతో రెండో స్థానాన్ని ఆక్రమించింది. రెండేళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) 98.0 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువను కలిగి ఉన్నాయి. ఆ తర్వాత ర్యాంకింగ్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌హెచ్), ఢిల్లీ డేర్‌డెవిల్స్ (డీడీ), కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్తాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) జట్లు ఉన్నాయి. ఈ సందర్భంగా డఫ్ అండ్ ఫెల్ప్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.సంతోష్ మాట్లాడుతూ భారతదేశంలో ఐపీఎల్‌కు ఉన్న బ్రాండ్ విలువ వల్ల క్రికెట్‌కు మరింత ఆదరణ పెరగడమే కాకుండా మార్కెటింగ్‌పరంగా ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రయోజనాలు పొందేందుకు మేలు జరుగుతుందని అన్నాడు.