క్రీడాభూమి

ఫ్లాగ్ బేరర్ నీరజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. ఆసియా గేమ్స్‌లో భారత బృందానికి అగ్రభాగాన పతాకధారియై నిలిచే అవకాశం అందింది. ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు జకర్తా, పాలెంబాగ్‌లో జరగనున్న ఆసియా గేమ్స్ ఆరంభ వేడుకల్లో భారత బృందానికి ముందు పతాకధారియై నిలబడి జట్టును చోప్రా నడిపిస్తాడని భారత ఒలింపిక్ సమాఖ్య (ఐఓఏ) ప్రకటించింది.
20ఏళ్ల నీరజ్ చోప్రా ఆసియా గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణం సాధించగలడన్న అంచనాలూ లేకపోలేదు. ‘ఆసియా గేమ్స్‌లో ఫ్లాగ్ బేరర్‌గా నా పేరు ప్రకటించినపుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యా. అంత పెద్ద ఈవెంట్‌లో భారత బృందానికి అగ్రభాగాన నిలిచే అవకాశం దక్కడం నిజంగా నా అదృష్టం’ అంటూ ఫిన్లాండ్‌లో శిక్షణలోవున్న నీరజ్ వ్యాఖ్యానించాడు. ‘ఈ విషయం ఇంతకుముందెప్పుడూ ప్రస్తావనకు రాకపోవడంతో, నేనూహించలేదు. తొలిసారి ఫ్లాగ్ బేరర్ అవకాశం వచ్చింది. అదీ ఆసియా గేమ్స్‌లో’ అంటూ ఉద్వేగానికి గురయ్యాడు నీరజ్. 2014 ఆసియా గేమ్స్‌లో మాజీ హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్ పతాకధారియై భారత బృందానికి అగ్రభాగాన నిలిచిన విషయం తెలిసిందే.