క్రీడాభూమి

పీటర్సన్‌కు గాయం.. ఐపిఎల్‌కు దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, ఏప్రిల్ 24: ఇంగ్లాండ్ బ్యాటింగ్ స్టార్ కెవిన్ పీటర్సన్ ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)కు దూరమయ్యాడు. కాలి కండరాలు బెణకడంతో అతను ఐపిఎల్‌లో మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదని రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కాలి కండరాలు బెణకడంతో కుప్పకూలిన పీటర్సన్‌ను మైదానం నుంచి ఎత్తుకొని తీసుకెళ్లాల్సి వచ్చింది. పరీక్షల అనంతరం అతనికి విశ్రాంతి అత్యవసరమని, కొన్ని వారాలు క్రికెట్ ఆడరాదని వైద్యులు ప్రకటించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో లండన్ తిరిగి వెళుతున్నానని, వచ్చే ఏడాది మళ్లీ వస్తానని ఆశిస్తున్నానని పీటర్సన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో రాసుకున్నాడు. వేసవి సెలవులను కుటుంబ సభ్యులతో కలిసే అవకాశం రావడం తన అదృష్టమని వ్యాఖ్యానించాడు.