క్రీడాభూమి

భారత్-కివీస్ మధ్య డే/నైట్ టెస్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, ఏప్రిల్ 26: ఈ ఏడాది చివర భారత్‌లో జరిపే పర్యటన సందర్భంగా గులాబీ రంగు బంతితో డే/నైట్ టెస్టు మ్యాచ్ ఆడే విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు పరిశీలిస్తోంది. గత ఏడాది అడిలైడ్‌లో న్యూజిలాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య డే/నైట్ టెస్టు మ్యాచ్ జరిగిన విషయం విదితమే. ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలి డే/నైట్ టెస్టు మ్యాచ్ ఇదే. అయితే మైదానానికి పెద్ద సంఖ్యలో వీక్షకులను రప్పించాలన్న ప్రయత్నంలో భాగంగా భారత్‌లోనూ ఇటువంటి మ్యాచ్‌లు నిర్వహించాలని యోచిస్తున్నామని, అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో డే/నైట్ టెస్టు మ్యాచ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) గత వారం వెల్లడించింది. ఈ విషయమై న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ గత వారం దుబాయ్‌లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా భారత అధికారులతో చర్చలు జరిపాడు. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య డే/నైట్ టెస్టు మ్యాచ్ నిర్వహించే విషయమై ఈ చర్చల్లో ఇరుపక్షాలు సానుకూలత వ్యక్తం చేశాయని, గులాబీ రంగు బంతితో నిర్వహించే ఇటువంటి మ్యాచ్‌లకు మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నామని డేవిడ్ వైట్ పేర్కొన్నట్లు ‘న్యూజిలాండ్ హెరాల్డ్’ పత్రిక వెల్లడించింది. ఈ విషయంలో ఇరు దేశాల క్రికెట్ బోర్డులు మరింత ముందుకు సాగితే భారత్‌లో తొలి డే/నైట్ టెస్టు మ్యాచ్‌కు ముంబయి ఆతిథ్యమిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అయితే అక్టోబర్‌లో న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు రావడానికి ముందుగానే బిసిసిఐ ప్రయోగాత్మకంగా గులాబీ రంగు బంతులతో కొన్ని దేశవాళీ మ్యాచ్‌లు నిర్వహించనుంది. ఈ ఏడాది చివర న్యూజిలాండ్‌తో డే/నైట్ టెస్టు మ్యాచ్ నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించిందని, అయితే అంతకంటే ముందు దులీప్ ట్రోఫీ టోర్నమెంట్‌లో ప్రయోగాత్మకంగా డే/నైట్ టెస్టు మ్యాచ్ నిర్వహించడం జరుగుతుందని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశాడు. భారత ఉపఖండంలోని ప్రత్యేక వాతావరణ పరిస్థితుల నడుమ ఫ్లడ్‌లైట్ల వెలుగులో టెస్టు మ్యాచ్‌లు నిర్వహించేందుకు గులాబీ రంగు కూకబుర్రా బంతులు ఎంత మేరకు అనువుగా ఉంటాయో తెలుసుకోవాలన్న ప్రధాన ఉద్దేశ్యంతోనే దులీప్ ట్రోఫీ టోర్నీలో వీటిని పరీక్షించనున్నట్లు ఆయన చెప్పాడు.