క్రీడాభూమి

అమీర్‌ఖాన్‌తో ఫైట్‌కు రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్, ఏప్రిల్ 26: బ్రిటిష్ ప్రొఫెషనల్ బాక్సర్ అమీర్ ఖాన్‌తో స్వదేశంలో పోరాటానికి సిద్ధంగా ఉన్నానని భారత స్టార్ విజేందర్ సింగ్ ప్రకటించాడు. గతంలో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన అమీర్ ఖాన్ త్వరలో భారత్‌లో విజేందర్‌తో తలపడాలని ఉందని వెల్లడించిన విషయం విదితమే. దీంతో అమీర్ సవాలును స్వీకరించి అతనితో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని విజేందర్ స్పష్టం చేశాడు. ‘ఏడాది క్రితమే ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో కెరీర్ ప్రారంభించిన నేను ఇప్పటివరకూ కేవలం నాలుగుసార్లు మాత్రమే ప్రో రింగ్‌లోకి దిగాను. అయినప్పటికీ అమీర్ సవాలును స్వీకరిస్తున్నా. అతనితో నేను జరిపే పోరు మన దేశంలో బాక్సింగ్‌కు మరింత ఊతాన్ని ఇస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నా’ అని విజేందర్ పేర్కొన్నాడు.