క్రీడాభూమి

32ఏళ్ల తరువాత..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* చెస్ ఆనంద్‌లో కొత్త ఉత్సాహం టాటా స్టీల్ టోర్నీకి రాక

కోల్‌కతా, సెప్టెంబర్ 15: టాటా స్టీల్ చెస్ ఇండియా రాపిడ్ అండ్ బ్లిజ్ టోర్నమెంట్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ స్టార్ అట్రాక్షన్ కాబోతున్నాడు. నవంబర్ 9 నుంచి 14 వరకూ కోల్‌కతాలో జరగనున్న టాటా స్టీల్ చెస్ టోర్నీలో విశ్వనాథన్ ఆడుతుండటమే ఆ అట్రాక్షన్. నిజానికి ఆనంద్‌కు అవి భావోద్వేగ క్షణాలే. అదే విషయంపై శనివారం మీడియాతో మాట్లాడుతూ ‘1986లో కోల్‌కతాలో నా తొలి గ్రాండ్‌మాస్టర్ టోర్నమెంట్ ఆడటం నాకు గుర్తుంది. అదీ టాటా స్టీల్ నిర్వహించిన ఈవెంటే. అలా మొదలైన ప్రస్తానంలోనే నేను అంతర్జాతీయ మాస్టర్ అయ్యా’నని గుర్తు చేసుకున్నాడు.
40వేల అమెరికన్ డాలర్ల ప్రైజ్ మనీతో టోర్నమెంట్‌ను ప్రకటించడం తెలిసిందే. టోర్నీకి అజెర్‌బైజాన్ జీఎం, ప్రపంచ మూడో ర్యాంకర్ షక్రియార్ మెమెద్యరోవ్; అర్మెనియన్ జీఎం, ప్రపంచ ఆరో ర్యాంకర్ లెవన్ అరోనియన్; అమెరికన్ జీఎం, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ వెస్లీ; జపనీస్- అమెరికన్ జీఎం, ప్రపంచ 14వ ర్యాంకర్, నాలుగుసార్లు యుఎస్ చాంపియన్ హికారు నకముర; రష్యా జీఎం, ప్రపంచ 15వ ర్యాంకర్ సెర్జీ కర్జకిన్‌లాంటి చదరంగం స్టార్ ఆటగాళ్లు హాజరవుతున్నారు. ‘ఈ టోర్నీలో ఆడటం చాలా ఉత్సాహాన్నిస్తుంది. టాటా స్టీల్ టోర్నీ ఈ ప్రాంతంలో చదరంగానికి కొత్త ఊపిర్లు ఊదుతుందని భావిస్తున్నా’నని ప్రపంచ 10వ ర్యాంకర్, 48ఏళ్ల ఆనంద్ ఆశాభావం వ్యక్తం చేశాడు. టోర్నమెంట్‌కు సంబంధించి టాటా స్టీల్ వైస్ ప్రసిడెంట్ సునీల్ భాస్కరన్ మాట్లాడుతూ ‘ఇది ఒకసారితో అయిపోయే ఈవెంట్ అని మేమనుకోవడం లేదు. మాకున్న ప్రణాళికలో ఇది ఆరంభం మాత్రమే. దీన్నొక క్లాసికల్ ఫార్మాట్‌గా మార్చాలన్నది ఆలోచన. దీన్ని ఫిఫ్టీ, ట్వెంటీ (రాపిడ్, బ్లిట్జ్) ఫార్మాట్‌గా ప్రస్తుతం ఆరంభిస్తున్నాం. భవిష్యత్‌లో ఏకైక అంతర్జాతీయ ప్రొఫెషనల్ చెస్ ఈవెంట్‌గా తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నాం’ అని పేర్కొన్నాడు.