క్రీడాభూమి

అది జాతిదూషణే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్: ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొరుూన్ అలీ త్వరలో విడుదల చేయనున్న ఆత్మకథలో చేసిన అభియోగాలపై దర్యాప్తు జరపాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించింది. 2015లో ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన సమయంలో ఓ ఆటగాడి నుంచి జాతి వ్యతిరేక దూషణలు ఎదుర్కొన్నానంటూ మొరుూన్ అలీ తన ఆత్మకథలో పేర్కొన్నాడు. కార్డ్ఫిలో ఆస్ట్రేలియా జట్టుపై తాము విజయం సాధించామని, ఆ మ్యాచ్‌లో 77 పరుగులు సాధించి ఐదు వికెట్లు తీసిన తనను ఆస్ట్రేలియా ఆటగాడు మత విశ్వాసాన్ని దెబ్బతీసేలా అహంకార వ్యాఖ్యలు చేశాడంటూ మొరుూన్ పేర్కొన్నాడు.
‘నా వ్యక్తిగత సామర్థ్య ప్రదర్శనలో ఆస్ట్రేలియాతో ఆడిన ఆ టెస్ట్ మ్యాచ్ చాలా కీలకం’ అని తన ఆత్మకథలో నమోదు చేశాడు. ‘ఏదేమైనా అక్కడొక సంఘటన చాలా బాధించింది. మైదానంలో ఓ ఆస్ట్రేలియన్ ఆటగాడు నావైపు చూస్తూ ‘అది తీసుకో, ఒసామా’ అని వ్యాఖ్యానించాడు. నేను విన్నది ముందు నమ్మలేకపోయా. అది గుర్తొస్తే ఇప్పటికీ తీవ్ర కోపం వస్తుంది. అయితే, ఆ ఘటన ఎదురైన సమయంలో మాత్రం మైదానంలో నిదానంగానే ఉన్నాను. ఒకరిద్దరు ఆటగాళ్లకు అప్పుడే విషయం చెప్పాను. నాకు తెలిసి ఇంగ్లీష్ కోచ్ ట్రెవర్ బేలిస్ ఆస్ట్రేలియా కోచ్ డారెన్ లెహ్‌మాన్‌తో మాట్లాడే ఉంటాడు’ అని మొరుూన్ ఆత్మకథలో రాశాడు. సిరీస్ ముగింపునకు ముందు అది కంటిన్యూ అయ్యిందని పేర్కొన్నాడు. ‘ఆటగాడి వ్యాఖ్యల్ని ఆస్ట్రేలియా జట్టులోని స్నేహితులకు చెప్పినపుడు, వాళ్లు అతడిని నిలదీశారు. మొరుూన్‌ను ఒసామా అని సంబోధించావా? అని ప్రశ్నించారు. తాను అలా అనలేదని, ‘తీసుకో అది -పార్ట్‌టైమర్’ అని మాత్రమే అన్నట్టు అబద్ధం చెప్పాడు. ఆటగాడు అబద్ధం చెప్పడం నచ్చలేదు. దాంతో ఆ సిరీస్ మొత్తం నేను కోపంగానే ఉన్నాను’ అని మొరుూన్ తన ఆత్మకథలో పేర్కొన్నాడు. మొరుూన్ అభియోగాలపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది. సీఏ అధికార ప్రతినిధి ఒకరు స్పందిస్తూ ‘సహజ స్వభావానికి విరుద్ధమైన ఇలాంటి ఘటనలకు ఆటలోనే కాదు, సమాజంలోనూ చోటు ఉండకూడదు. ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించిన ఆటగాళ్లు స్వచ్ఛమైన విలువలు, ప్రవర్తనతో ఉండాలనే కోరుకుంటాం. మొరుూన్ అభియోగాలను క్రికెట్ ఆస్ట్రేలియా తీవ్రంగానే పరిగణించింది. అభియోగాల్లోని వాస్తవాలను వెలికి తీయడం అత్యవసరంగా పరిగణించి ఈసీబీ (ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు)తో దర్యాప్తు జరపనుంది’ అని పేర్కొన్నాడు.